ఈ మూవీకి ఏ టైటిల్‌ను పెడతారనే దానిపై చాలా వార్తలే వినిపిస్తున్నాయి. విశ్వంభర అనే టైటిల్ ముందుగా వినిపించింది. కానీ ఇప్పుడు మరో టైటిల్ ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.
ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’, ‘అధికారి’ అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ‘C..E..O’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. చరణ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్‌కి పాన్ ఇండియా అప్పీల్ కూడా ఉంటుందని భావిస్తున్నారట.
తెలుగు నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. శంకర్ సినిమా అంటే ఎంత గ్రాండియర్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వైపు మెగా ఫ్యాన్స్, మరో వైపు సినీ ప్రేక్షకులు RC15 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్..కొన్ని తప్పని సరి పరిస్దితుల్లో ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
