మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్. 2021 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న క్రాక్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా క్రాక్ మూవీ డబ్బింగ్ లో పాల్గొన్నారు రవితేజ. ఆయన డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ చెవుతున్న ఫోటోలు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు . 

క్రాక్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా... రవితేజ వైఫ్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. తమిళ నటులు సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక రోల్స్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం క్రాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు మంచి విజయాలు అందుకున్నాయి. 

ఇక విజయాల పరంగా వెనుకబడ్డ రవితేజ క్రాక్ తో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నారు. రవితేజ నటించిన గత చిత్రం డిస్కో రాజా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. నిర్మాత బి మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం  ట్రైలర్ జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.