ఓ వైపు థియేటర్లన్నీ క్లోజ్‌ అయ్యాయి. షూటింగ్‌లన్నీ బంద్‌ అయ్యాయి. దీంతో తాజాగా మాస్‌ మహారాజా రవితేజ కూడా బ్యాక్‌ అయ్యారు.

కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. చిరంజీవి `ఆచార్య`,, వెంకటేష్‌ `నారప్ప` రానా `విరాటపర్వం`, నాని `టక్‌జగదీష్‌` చిత్రాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఓ వైపు థియేటర్లన్నీ క్లోజ్‌ అయ్యాయి. షూటింగ్‌లన్నీ బంద్‌ అయ్యాయి. దీంతో తాజాగా మాస్‌ మహారాజా రవితేజ కూడా బ్యాక్‌ అయ్యారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `ఖిలాడి` చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా విలయతాండవం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. పరిస్థితులు కుదుట పడ్డాక రిలీజ్‌ చేస్తామని, విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. 

Scroll to load tweet…

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న `ఖిలాడి` చిత్రంలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇందులో డింపుల్‌ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ, పెన్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో సాగుతూ ఆకట్టుకుంది.