పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కి ఎలాంటి దర్శకుడైనా సినిమా చేయడానికి ముందుకొస్తారు. కానీ పవన్ మాత్రం పెద్ద దర్శకులతో వర్క్ చేసింది చాలా తక్కువ. త్రివిక్రమ్ మినహా దాదాపు చిన్న దర్శకులనే ఎందుకొని హిట్స్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే గతంలో ఆయన సంతోష్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ లో సినిమాను నిర్మించడానికి కూడా ఎప్పుడో సిద్ధమైంది. విజయ్ 'తేరి'ని తెలుగులో రీమేక్ చేయాలనీ దర్శకుడితో పవన్ కు తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదు. దీంతో రవితేజకు ఆ స్క్రిప్ట్ ను షిఫ్ట్ చేశారు. 

అయితే మొదట మాస్ రాజా కూడా ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. రవితేజ విఐ.ఆనంద్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ అదే సినిమాను పట్టాలెక్కించనున్నాడు. దీంతో దాదాపు సంతోష్ తేరి రీమేక్ ను క్యాన్సిల్ చేసినట్లే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ అయిన అయ్యింది. 

అది రిలీజైనట్టు పెద్దగా ఎవ్వరికి తెలియకపోయినప్పటికీ రిస్క్ చేయకూడదని రవితేజ అనుకున్నట్లు టాక్. అదే విధంగా మరొక డిఫరెంట్ స్టోరీ ఉంటె చూడామని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇక రవితేజ మైత్రి మేకర్స్ తో చేసిన అమర్ అక్బర్ ఆంటోని శుక్రవారం రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.