Asianet News TeluguAsianet News Telugu

రవితేజ ప్రాజెక్ట్ ఆ యంగ్ హీరో దగ్గరకు... క్రేజీ కాంబో సెట్ అయ్యిందా?


హీరో రవితేజతో స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేయాల్సిన ప్రాజెక్ట్ ఓ యంగ్ హీరో దగ్గరకు వెళ్లిందని ఇండస్ట్రీ టాక్. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.. 
 

raviteja project goes to vishwak sen with jatiratnalu fame anudeep kv ksr
Author
First Published Jun 26, 2024, 5:57 PM IST

రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీ. దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని వాయువేగంతో పూర్తి చేస్తున్నాడు. కాగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ చాలా కాలంగా రవితేజ కోసం ఎదురుచూస్తున్నాడట. అనుదీప్-సూర్యదేవర నాగవంశీ-రవితేజ కాంబోలో ఓ మూవీ అనుకున్నారట. అయితే ఎంతకీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదట. దాంతో అనుదీప్ ని నాగవంశీ మరో హీరోకి కథ చెప్పమన్నాడట. 

విశ్వక్ సేన్ తో ఆ మూవీ చేయాలని నాగ వంశీ డిసైడ్ అయ్యాడట. విశ్వక్ సేన్ కి అనుదీప్ కథ చెప్పినట్లు సమాచారం. అనూహ్యంగా విశ్వక్ సేన్ కూడా అనుదీప్ ని వెయిటింగ్ లో పెట్టాడట. వరుస ప్రాజెక్ట్స్ నేపథ్యంలో కొన్నాళ్ళు ఆగమన్నాడట. దాంతో అనుదీప్ కి విశ్వక్ సేన్ వద్ద కూడా నిరాశే ఎదురైందట. రవితేజ, విశ్వక్ సేన్ కాకుండా మరొక హీరోని అనుదీప్ సంప్రదిస్తాడా? లేక ఎదురు చూస్తాడా? అనే చర్చ జరుగుతుంది. 

అనుదీప్ జాతిరత్నాలు చిత్రంతో వెలుగులోకి వచ్చాడు. మొదటి చిత్రంతోనే సంచలన విజయం నమోదు చేశాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చిన జాతిరత్నాలు భారీ వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు పంచింది. అనుదీప్ తన మార్క్ కామెడీతో నవ్వులు పూయించారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు. రెండో చిత్రం తమిళ స్టార్ కార్తికేయన్ తో చేశాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios