తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి కి కరోనా సోకినట్లు సమాచారం అందుతుంది.  డింపుల్ హయాతి (Dimple Hayathi) జర్వం, జలుబు వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతూ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కరోనా (Corona Virus) తీవ్రత దేశంలో అధికం అవుతుంది. రోజుకో విధంగా వైరస్ పెరిగిపోతుంది. నిన్న ఆదివారం ఒక్కరోజే 2.71 లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఈ మహమ్మారి ఎంత వేగంగా వ్యాపిస్తుందో. మరోవైపు వరుసగా చిత్ర ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. రెండు వారాల వ్యవధిలో పదుల సంఖ్యలో చిత్ర ప్రముఖులు కరోనా రోగులుగా మారారు. తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి కి కరోనా సోకినట్లు సమాచారం అందుతుంది.

డింపుల్ హయాతి (Dimple Hayathi) జర్వం, జలుబు వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతూ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తనకు కరోనా సోకిందన్న విషయం తెలియజేస్తూ డింపుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఓ పోస్ట్‌ చేశారు. ''రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్లు సూచనలను పాటిస్తున్నాను. అందరూ మాస్క్‌ ధరించండి. శానిటైజ్‌ చేసుకోండి.. వ్యాక్సిన్‌ తీసుకోండి. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తా'' అని పేర్కొన్నారు.

2019లో విడుదలైన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో ‘జర్రా.. జర్రా' అనే ఐటెం సాంగ్ లో డింపుల్ హయాతి తన బోల్డ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’(Khiladi) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. డింపుల్ హయాతికి కెరీర్ లో దక్కిన పెద్ద ఆఫర్ ఖిలాడి చిత్రం. ఖిలాడి మూవీతో తనకు బ్రేక్ వస్తుందని గట్టిగా నమ్ముతుంది. 

కాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) సైతం కరోనా బారినపడ్డారు. జనవరి 16 ఆదివారం ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇంట్లో క్వారంటైన్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు (Mahesh Babu)కి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. రెండు వారాల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నట్లు సమాచారం అందుతుంది.