Asianet News TeluguAsianet News Telugu

రవితేజని మళ్లీ టార్గెట్‌ చేశారే?.. సంక్రాంతికి తప్పుకుంటే ఫిబ్రవరిలోనూ అదే గోల.. ఒప్పందాల సంగతేంటి?

మాస్‌ మహారాజా రవితేజకి మరోసారి క్లాష్‌ తప్పడం లేదు. సంక్రాంతికి తప్పుకుంటే ఇప్పుడు ఫిబ్రవరిలోనూ అదే పరిస్థితి. ఇప్పుడు కూడా నాలుగు సినిమాలో బరిలోకి దిగుతున్నాయి. 

raviteja facing big clash once more in february three more films coming same date arj
Author
First Published Jan 9, 2024, 7:15 PM IST

మాస్‌ మహారాజా పెద్ద మనసుతో సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారు. ఇతర చిత్రాల నిర్మాతలు, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఫిల్మ్ ఛాంబర్‌ వంటి వారంతా కలిసి సంక్రాంతి పోటీని తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా సంక్రాంతి పోరు నుంచి రవితేజ తప్పుకున్నారు. ఆయన నటించిన `ఈగల్‌` మూవీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నట్టు కొత్త డేట్‌ ఇచ్చారు. సంక్రాంతి నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్‌ డేట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఫిల్మ్ ఛాంబర్‌ తెలిపింది. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ అన్నారు. ఆ ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్‌ రాజు కూడా చెప్పాడు. 

కానీ అవన్నీ ఏం పనిచేయడం లేదు. వాళ్ల భరోసాతో వాయిదా వేసుకున్న `ఈగల్‌` సినిమాకి మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతుంది. ఫిబ్రవరి 9న సోలోగా ఇస్తామన్నారు. కానీ అదే డేట్‌కి ఇప్పుడు నాలుగు సినిమాలు వచ్చి పడ్డాయి. కేవలం `టిల్లు స్వ్కైర్‌` ని వాయిదా వేస్తారని తెలుస్తుంది. కానీ సందీప్‌ కిషన్‌ `ఊరు పేరు భైరవకోన`, `యాత్ర 2` చిత్రాలు బరిలో నిలిచాయి. దీంతోపాటు తాజాగా మరో సినిమా వచ్చింది. తమిళంలో రూపొందిన `లాల్‌ సలామ్‌` కూడా అదే డేట్ కి వస్తుంది. రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ రూపొందించింది. విష్ణు విశాల్‌ ఇందులో హీరో. ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోటీ నేపథ్యంలో వాయిదా వేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 9న విడుదల చేస్తామని ప్రకటించారు. 

దీంతో ఇప్పుడు ఫిబ్రవరి రెండో వారంలో నాలుగు సినిమాల మధ్య పోటీ ఏర్పడుతుంది. రవితేజ నటించిన `ఈగల్‌` చిత్రంతోపాటు సందీప్‌ కిషన్‌ `ఊరు పేరు భైరవకోన`తోపాటు రజనీకాంత్‌ `లాల్‌ సలామ్‌` కూడా రిలీజ్‌ కాబోతుంది. ఒక్క రోజు ముందుగానే ఫిబ్రవరి 8న `యాత్ర 2` రిలీజ్‌ కానుంది. ఈ సినిమా రిలీజ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఎలాంటి అడ్డంకి ఉండదు. సందీప్‌ కిషన్‌ సినిమా కూడా రాబోతుంది. సంక్రాంతి పోటీ సమయంలో నిర్మాతల మధ్యజరిగిన చర్చల్లో తమని పిలవలేదని, తమని సంప్రదించలేదని ఆ చిత్ర నిర్మాత అనిల్‌ సుంకరి అలిగాడు. దీంతో ఆయన తన సినిమాని వాయిదా వేసుకునేందుకు సిద్ధంగా లేడు. అంతేకాదు కావాలని అదే డేట్‌కి రావాలని ఉన్నాడు. 

మరోవైపు ఇప్పుడు తమిళ సినిమా `లాల్‌ సలామ్‌` కూడా అదే డేట్‌కి రావడం ఆశ్చర్యంగా మారింది. రజనీకి తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీగా వసూలు చేస్తుంటాయి. దీంతో కచ్చితంగా థియేటర్లు బాగానే ఆ మూవీకి ఇవ్వాల్సి వస్తుంది. పైగా తమిళ, తెలుగు సేమ్‌ డేట్‌ కావడంతో దీన్ని కూడా మార్చే ఛాన్స్ లేదు. దీంతో మిగిలిన మూడు సినిమాలతో రవితేజ పోటీ పడాల్సి వస్తుంది. సంక్రాంతికి ఐదు సినిమాలతో తప్పుకుంటే, ఇప్పుడు నాలుగు సినిమాల మధ్య కొట్టుకోవాల్సి వస్తుంది. అయితే సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా జనం చూస్తారు. కానీ ఫిబ్రవరిలో చూస్తారా? అనేది సమస్య. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ తో బిజీగా ఉంటారు. అసలే గడ్డు కాలం. పైగా ఇలాంటి పోటీ నెలకొంటే అది మరింత ప్రభావం చూపిస్తుంది. 

దీంతో ఇప్పుడు రవితేజ సినిమాపైనే ఆ ప్రభావం కనిపించనుంది. కంటెంట్‌ బాగుంటే ఆ మూవీ నెమ్మదిగా అయినా పుంజుకుంటుంది. లాంగ్‌ రన్‌లో ఆడుతుంది. కానీ ఓపెనింగ్స్ చాలా ముఖ్యం. మొదటి వీకెండ్‌ చాలా కీలకం. ఆ మూడు రోజుల్లో వచ్చే కలెక్షన్లే నిర్మాతలకు, బయ్యర్లకి చాలా ముఖ్యం. అదే మిస్‌ అయితే పెద్ద దెబ్బే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పైగా రవితేజ నటించిన `ఈగల్‌` చిత్రంలో సీరియస్‌ కంటెంట్‌ ఉంది. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కనిపించడం లేదు. ఇది కూడా సినిమాపై ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios