ఈగల్ టైటిల్ హిందీకు బాగనే ఉంటుంది కదా..మళ్లీ మార్చటం ఎందుకు అన్నారు. కాకపోతే అక్కడ  ఆల్రెడీ ఈగల్ టైటిల్ తో  ఓ చిత్రం ఉందని,

రవితేజ తాజా చిత్రం ఈగల్ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలసిమందే. గత కొద్ది రోజులుగా సినిమాని సంక్రాంతికు తెద్దామా ,వద్దా అనే డైలమోలో ఉన్నప్పటికీ, ఫైనల్ గా సంక్రాంతికే ఫిక్స్ అయ్యారు.ఆ విషయం స్పష్టం చేస్తూ జనవరి 13న వస్తున్నాం అంటూ హిందీ టీజర్ తో మూవీ టీం స్పష్టం చేసింది. అయితే అదే హిందీ టీజర్ చూసిన వారికి అక్కడ హిందీ వెర్షన్ కు పెట్టిన టైటిల్ చూసి ఆశ్చర్యపోయారు, #Eagle టైటిల్ హిందీకు బాగనే ఉంటుంది కదా..మళ్లీ మార్చటం ఎందుకు అన్నారు. కాకపోతే అక్కడ ఆల్రెడీ ఈగల్ టైటిల్ తో ఓ చిత్రం ఉందని, అందుకే మార్చారని సమాచారం. ఇంతకీ హిందీ వెర్షన్ కు పెట్టిన టైటిల్ ఏంటంటే...

 ఈ మూవీని హిందీలో ‘సహదేవ్’ (Sahadev) అనే పేరుతో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీజర్ తో ప్ర‌క‌టించింది టీమ్. సాధారణంగా రవితేజ నటించిన సినిమాలన్నీ హిందీలో డబ్ అయి యూట్యూబ్లో రిలీజ్ అవుతుంటాయి.ఆ హిందీ డబ్బింగ్ వర్షన్స్ యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకున్నాయి. దాంతో నార్త్ లోనూ రవితేజ కి మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ రవితేజతో రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని అమాంతం పెంచేశాయి. “ఈగల్” మూవీని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ధమాకాని మించి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.



 ఈగల్‌లో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. డవ్‌జాండ్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద గట్టిపోటీ వుండబోతుంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, నాగార్జున ‘నా సామిరంగ’ తో పాటు పాటు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ మూవీ హనుమాన్.. కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.