ఖిలాడి షూటింగ్ చివరి దశలో ఉండగా, నేడు తన 68వ చిత్రం ప్రకటించారు. ఈ నూతన చిత్ర ప్రీ లుక్ విడుదల చేయడంతో పాటు సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను పరిచయం చేశారు.
క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు రవితేజ. వరుస ప్లాప్స్ తో డీలాపడ్డ ఆయన మిస్సైల్ వలె పైకి లేచాడు. రవితేజకు సరైన సినిమా పడితే వసూళ్ల వర్షమే అని నిరూపించారు. క్రాక్ మూవీ విజయంతో ఊపుమీదున్న రవితేజ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. క్రాక్ విడుదలైన వెంటనే దర్శకుడు రమేష్ వర్మతో ఖిలాడి మూవీ ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేశాడు. సమ్మర్ కానుకగా ఖిలాడి విడుదల కావాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
ఖిలాడి షూటింగ్ చివరి దశలో ఉండగా, నేడు తన 68వ చిత్రం ప్రకటించారు. ఈ నూతన చిత్ర ప్రీ లుక్ విడుదల చేయడంతో పాటు సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను పరిచయం చేశారు. మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఉద్యోగిగా రవితేజ నటిస్తున్నాడని ప్రీ లుక్ ద్వారా అర్థం అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్ గా రవితేజ విభిన్న రోల్ ట్రై చేస్తున్నారు.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించనున్నారు. ఆర్ టి టీమ్ వర్క్స్ ఈ మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మొత్తంగా ప్రీ లుక్ తోనే మూవీపై అంచనాలు పెంచేశాడు రవితేజ.
