Asianet News TeluguAsianet News Telugu

ఐమాక్స్ నిర్మిస్తున్న రవితేజ.. ఇదే ఫస్ట్‌ టైమ్‌..?

రవితేజ ఇప్పటికే స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. అలాగే ఇటీవల నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు థియేటర్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఏకంగా ఐమాక్స్ ని టార్గెట్‌ చేశాడు.

raviteja building imax theater first time in hyderabad arj
Author
First Published Feb 27, 2024, 8:06 PM IST

మాస్‌ మహారాజా రవితేజ స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ ని ప్రారంభించి నటుడిగా, అట్నుంచి హీరోగా మారాడు. ఇప్పుడు టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన సినిమా ఆశించిన స్థాయిలో రిజల్ట్ సాధించడం లేదు. ప్రస్తుతం ఆయన రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు. 

ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ఆయన నిర్మాతగా మారాడు. `రావణాసుర`తోపాటు రెండు మూడు చిన్న సినిమాలను నిర్మించాడు. అవి సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెడుతున్నాడు. మల్టీఫ్లెక్స్ రంగంలోకి ఎంటర్‌ అవుతున్నాడు. ఆయన ఇప్పటికే ఏషియన్‌ సునీల్‌ తో కలిసి మల్టీ ఫ్లెక్స్ నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

దిల్‌సుఖ్‌ నగర్‌లో ఓ మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌ నారంగ్‌తో కలిసి ఈ మల్టీఫ్లెక్స్ ని నిర్మిస్తున్నారు. అయితే దీన్ని ఐమాక్స్ వెర్షన్‌లో కడుతున్నారట. హైదరాబాద్‌లో ఐమాక్స్ లేదు. గతంలో ప్రసాద్‌ ఐమాక్స్ ఉండేది. థియేటర్లో సినిమా స్క్రీనింగ్‌ ఐమాక్స్ ఫార్మాట్‌లో ఉండేది. కానీ డిజిటలైజేషన్‌ కారణంగా ఐమాక్స్ ఫార్మాట్‌ని తీసేశారు. దీంతో అది ప్రసాద్‌ మల్టీఫ్లెక్స్ గా మారిపోయింది. 

అయితే ఇప్పుడు ఒరిజినల్‌ ఐమాక్స్ వెర్షన్‌ని రవితేజ, సునీల్‌ నారంగ్‌ తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఐమాక్స్ సంస్థతో వీళ్లు కలుస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌ చేసుకోబోతున్నారట. ఇదే అయితే ఇక `ఏఆర్‌టీ సినిమాస్‌`(ఏషియన్‌ రవితేజ సినిమాస్‌) అనేది ఐమాక్స్ ఫార్మాట్‌లో ఉండబోతుంది. అలాగే స్క్రీనింగ్‌ ఫార్మాట్‌ మాత్రమే కాదు, ఎంప్లాయిస్‌ విషయంలోనూ అదే రూల్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

సినిమా స్టార్లు ఇప్పటికే మల్టీఫ్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టారు. మహేష్‌ బాబు `ఏఎంబీ సినిమాస్‌` నిర్మించారు. సుదర్శన్‌ థియేటర్‌ని కూడా `ఏఎంబీ`గా మారుస్తున్నారు. మరోవైపు బెంగుళూరులోనూ ఓ మల్లీఫ్లెక్స్ నిర్మిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌ సత్యం థియేటర్‌ని `ఏఏఏ`గా మార్చారు. విజయ్‌ దేవరకొండ మహబూబ్‌ నగర్‌లో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నాడు. ఇవి రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు రవితేజ కూడా ఈ రంగంలోకి ఎంటర్‌ కావడంతోపాటు ఏకంగా ఐమాక్స్ వెర్షన్‌ తీసుకురాబోతుండటం విశేషమనే చెప్పాలి. అయితే వెంకటాద్రి థియేటర్‌ స్థానంలో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. 

ఇక ప్రస్తుతం రవితేజ.. హరీష్‌ శంకర్‌తో `మిస్టర్‌ బచ్చన్‌` మూవీలో నటిస్తున్నారు. ఇది హిందీలో వచ్చిన `రైడ్‌` మూవీకి రీమేక్‌. దీంతోపాటు అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. ఇందులో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios