'పెద్ద కాపు'కు బడ్జెట్ అంత పెట్టారా? ,షాకింగే
ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మోనల్లుడే ఈ విరాట్ కృష్ణ. కాగా, శ్రీకాంత్ అడ్డాల తన స్టైల్ ని మార్చి తీస్తున్న కథ ఇది.

ఓ కొత్త హీరో సినిమా అదీ సిని నట వారసుడు కానప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్ లు పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. ఎందుకంటే రికవరీ ఏ స్దాయిలో ఉంటుందో తెలియదు కాబట్టి. కానీ పెద కాపు సినిమాకు కొత్త హీరో లాంచింగ్ అయినా భారీగా పెట్టుబడి పెట్టినట్లు అంతర్గత సినీ వర్గాల సమాచారం. ఇంతకీ ఎంత బడ్జెట్ అయ్యిందనే వివరాల్లోకి వెళితే...
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ సంస్థ తెరకెక్కిస్తోన్న సినిమా 'పెద్ద కాపు' (Peddha Kapu Movie). మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ (Virat Karrna), ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల ఓ ప్రధాన పాత్ర పోషించారు. 'పెద కాపు -1' మూవీ రెండు పార్టులుగా రాబోతోంది. చిత్రానికి ఒక సామాజిక వర్గం పేరు పెట్టడమంటే కత్తి మీద సాము అనే చెప్పాలి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ రాబోతుంది.
ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కే పది కోట్లు పైన బడ్జెట్ పెట్టి భారీగా తీసారని తెలుస్తోంది. ఈ సినిమాలో నిర్మాతకు మేనల్లుడు అని తెలుస్తోంది. దాంతో అతన్ని యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఎక్కడా బడ్జెట్ కు వెనకాడలేదని వినికిడి. అయితే సినిమా యాక్షన్ తో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని , రెట్టింపు డబ్బు తెచ్చిపెడుతుందని టీమ్ నమ్ముతోంది. అలాగే యాక్షన్ సినిమా కాబట్టి హిందీ యూట్యూబ్ రైట్స్, ఓటిటి రైట్స్ తో చాలా భాగం రికవరీ ఉంటుందని ప్లాన్ చేసారట. నిర్మాత సైతం అవుట్ ఫుట్ చూసి చాలా హ్యాపీ ఫీలయ్యాడని చెప్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఫామ్ లోకి రావాలని తనే విలన్ గా చేస్తు దర్శకత్వం చేసిన చిత్రం ఇది.
ఈ మూవీలో కొత్త కుర్రాడు విరాట్ కర్ణ హీరోగా నటించగా.. హీరోయిన్ గా ప్రగతి శ్రీవాస్తవ చేస్తుంది. రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, అనసూయ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అఖండ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీని కూడా నిర్మిస్తున్నారు. కోసమెరుపు ఎంటంటే శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్హరమం