రవితేజకి డాక్టర్లు నయం చేయలేని జబ్బు!

First Published 8, Sep 2018, 3:15 PM IST
Ravi Teja suffers from multiple personality disorder in the film
Highlights

మాస్ మహారాజా రవితేజ డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బుతో బాధ పడుతున్నాడట. అయితే ఇదంతా సినిమాలో రవితేజ పోషించే క్యారెక్టర్ కి సంబంధించినదని తెలుస్తోంది. 

మాస్ మహారాజా రవితేజ డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బుతో బాధ పడుతున్నాడట. అయితే ఇదంతా సినిమాలో రవితేజ పోషించే క్యారెక్టర్ కి సంబంధించినదని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వినిపించాయి.

ఫస్ట్ లుక్ లో కూడా రవితేజకి చెందిన మూడు గెటప్పులు విడుదల చేయడంతో నిజమనే అనుకున్నారు. కానీ సినిమాలో కనిపించేది మాత్రం ఒక్క రవితేజనే. కథ ప్రకారం సినిమాలో హీరోకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్. దీంతో హీరో అమర్, అక్బర్, ఆంటోనీ అనే ముగ్గురు వ్యక్తుల్లా గెటప్స్ వేసుకొని ప్రవర్తిస్తుంటాడు. గతంలో విక్రమ్ నటించిన 'అపరిచితుడు' సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది.

అందులో దర్శకుడు సోషల్ మెసేజ్ పై దృష్టి పెట్టగా.. శ్రీనువైట్ల మాత్రం ఆ పాత్రల ద్వారా కామెడీ జెనరేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడు విభిన్నమైన పాత్రల్లో రవితేజ చేసే అల్లరి ఆడియన్స్ ని నవ్విస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. 

loader