మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా నటిస్తున్నాడు.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది.
యుఎస్ లాంటి ప్రాంతాల్లో ఈ అర్థరాత్రి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది అనగా చిత్ర యూనిట్ కి బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కీలక సన్నివేశాలు లీకై ఆన్లైన్ లో దర్శనం ఇస్తున్నాయి. రవితేజ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు లీకైనట్లు తెలుస్తోంది.
రామారావు ఆన్ డ్యూటీ చిత్ర టీం వెంటనే రంగంలోకి దిగి.. లీకైన ఫుటేజ్ ని డిలీట్ చేయాలి అని.. లేకుంటే అవి మరింతగా సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు అంటున్నారు. అసలే టాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి లీకులు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అనిపిస్తున్నాయి.
రవితేజ చివరగా నటించిన ఖిలాడీ తీవ్రంగా నిరాశపరిచింది. మరికొంత మంది అభిమానులు ఇలాగైనా సినిమాకి బజ్ ఏర్పడుతుంది అని అంటున్నారు. రవితేజ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావాలి అంటే మంచి బజ్ ఉండాలి అని అంటున్నారు. ఈ చిత్రంలో జై భీం ఫేమ్ రాజిష కీలక పాత్రలో నటిస్తోంది. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
