Raviteja: ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడి, ఎటూ తేల్చని రవితేజ,
ఈమధ్య సీక్వెల్స్ జోరు పెరిగిపోయింది. వరుసగా సీక్వెల్ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈక్రమంలో రాజాది గ్రేట్ సినిమాకు కూడా సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాని..?
సీక్వెల్ తీస్తాం అని హింట్ ఇచ్చి.. ప్రస్తుతం కామ్ గా ఉన్నారు రాజా ది గ్రేట్ టీమ్. సీక్వెల్స్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా.. ఈమూవీ కూడా చర్చకు వస్తుంటుంది. రాజా ది గ్రేట్ క్లైమాక్స్ కూడా సీక్వెల్ కు అనుకూలంగానే తీశారు. అంతే కాదు ఈ క్లైమాక్స్ ఇలా ఇవ్వడానికి కారణం.. రాజా ది గ్రేట్ 2 ఉంది అని అర్థం వచ్చేలా ముగించారు. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడికి తరచుగా ఇదే ప్రశ్న ఎదువుతూ ఉంటుంది.
అటు మాస్ మహారాజ్ రవితేజ కు కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుంటుంది. అయితే ఇటు అనిల్ రావిపూడి సై అంటున్నా.. రవితేజ్ మాత్రం కాస్త డిలై చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణతో భగవంత్ కేసరి తీసి.. హిట్ కొట్టాడు అనిల్. ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అదే జోష్ మీద.. నెక్ట్స్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. బాలయ్య బాబీ సినిమాలో జాయిన్ అయ్యాడు..కాని డైరెక్టర్ అనిల్ మాత్రంఎలాంటి అప్ డేట్ లేుకుండా కామ్ గాఉన్నారు. లాంటి సినిమా చేసి భారీ విజయం అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా తర్వాత ‘హీరో ఎవరు?’ అనే ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తోంది.
మొన్నీ మద్య ఇంటర్వ్యూలకు బయటకు వచ్చినా కూడా పెద్దగా ఈ విషయంలో సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఈ ప్రశ్నకు జవాబు దొరికిందంటున్నారు సినిమా పండితులు..రాజాది గ్రేట్ కు సీక్వెల్ చేయాలి అని గతంలోనే అనుకున్నారట. కాని వరుస సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు రవితేజ. ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. దాంతో.. అనిల్ రావిపూడి ప్రస్తుతం రవితేజ కోసమే వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లకు రవితేజ.. ఈమూవీ చేద్దాం అని క్లారిటీ ఇచ్చాడట. ఈ మేరకు దిల్ రాజు నుండి త్వరలో అనౌన్స్‌మెంట్ ఉండొచ్చు అంటున్నారు.
ప్స్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలున్నాయి. రవితేజ కార్తిక్ ఘట్టమనేనితో ఈగిల్ చేస్తున్నారు. త్వరలో గోపీచంద్ మలినేని సినిమా మొదలవుతుందట. ఈ రెండు అయ్యాకనే అనిల్ రావిపూడి సినిమా ఉండొచ్చు. మూడో సినిమాగా హరీశ్ శంకర్ సినిమా ఉండొచ్చు అని ఆ మధ్య అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానంలో అనిల్ రావిపూడి సినిమా పడుతుంది అంటున్నారు. ఈ మేరకు కథా చర్చలు త్వరలో ఉంటాయని కూడా చెబుతున్నారు.దీంతో అప్పుడెప్పుడో చెప్పిన ‘రాజా ది గ్రేట్ కు ఇన్నాల్ళకు మోక్షం లభించబోతున్నట్ట తెలుస్తోంది.