అనుదీప్‌తో రవితేజ సినిమా చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తుంది. ఇల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్‌ ఉందట. 

మాస్‌ మహారాజా రవితేజ.. మాస్‌, యాక్షన్‌, కామెడీ మేళవించిన స్టార్‌. ఆయనకు `జాతిరత్నాలు` డైరెక్టర్‌ అనుదీప్‌ కలిస్తే థియేటర్లలో నవ్వులే నవ్వులు. పొట్టచెక్కలయ్యేలా నవ్వులు విరుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా అలాంటి నవ్వులు రైడ్‌కి ప్రాజెక్ట్ సిద్ధమవుతుందట. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. రవితేజకి ఇటీవల దర్శకుడు అనుదీప్‌ కథ చెప్పారని, ఇంప్రెస్‌ అయిన మాస్‌ రాజా ఓకే చెప్పారని సమాచారం. 

అనుదీప్‌తో రవితేజ సినిమా చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తుంది. ఇల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్‌ ఉందట. అందుకోసం తమన్నా, త్రిష పేర్లు పరిశీలిస్తున్నారట. తమన్నా, త్రిషలతో రవితేజ సినిమాలు చేశారు. రవితేజ మాస్‌, యాక్షన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఈ ఇద్దరు భామ అందాలు తోడైతే థియేటర్లలో సీన్‌ రచ్చ రచ్చే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాల్చబోతుందని, అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 

`ధమాఖా`తో హిట్‌ కొట్టిన రవితేజ ఇటీవల `రావణాసుర`తో పరాజయం చవిచూశారు. ఇప్పుడు `టైగర్‌ నాగేశ్వరరావు` బయోపిక్‌ చేస్తున్నారు. బందిపోటు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు కొత్త దర్శకుడితో `ఈగల్‌` అనే మరో సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ సినిమా తర్వాత అనుదీప్‌ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది. `టైగర్‌ నాగేశ్వరరావు` షూటింగ్‌ చివరి దశలో ఉంది. త్వరలోనే ఇది రిలీజ్‌ కానుంది. ఆ వెంటనే `ఈగల్‌`తోపాటు అనుదీప్‌ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

అనుదీప్‌ `జాతిరత్నాలు` సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు.ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అలరించి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టారు. స్వతహాగా అనుదీప్‌లో మంచి కామెడీ టైమింగ్‌ ఉంటుంది. ఆ టైమ్‌కి, రవితేజ లాంటి స్టార్‌ తోడైతే థియేటర్లలో హంగామా మామూలుగా ఉండదని చెప్పొచ్చు. అయితే `జాతిరత్నాలు` తర్వాత శివకార్తికేయన్‌తో చేసిన `ప్రిన్స్` చిత్రం పెద్దగా ఆడలేదు. అనుదీప్‌ మార్క్ కామెడీ మిస్‌ కావడంతో సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ఇప్పుడు రవితేజ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకునే పనిలో ఉన్నారు అనుదీప్‌. మరి ఈ సినిమా ఏమేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.