ఎప్పటికప్పుడు ఫ్లాప్స్ అండ్ హిట్స్ హాయ్.. బాయ్ లు  చెబుతూనే ఉంటాయి. చాలా మంది జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తుంటారు. అందులో మాస్ రాజా రవితేజ ఒకరు. 

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు ఫ్లాప్స్ అండ్ హిట్స్ హాయ్.. బాయ్ లు చెబుతూనే ఉంటాయి. చాలా మంది జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తుంటారు. అందులో మాస్ రాజా రవితేజ ఒకరు. 

వరుసగా సినిమాలు చేస్తూ ఒకప్పుడు బిజీగా ఉండే ఆయన ఇటీవల చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత ఏడాది రాజా ది గ్రేట్ సినిమాతో ఆయన మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం వరుసగా టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ అంథోని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇకపోతే ఇప్పటివరకు మాస్ రాజా ఎప్పుడు టచ్ చేయని సైన్టిఫిక్ థ్రిల్లర్ ను కూడా టచ్ చేయనున్నాడు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాకు రవితేజ ఒకే చెప్పాడు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కథను అల్లినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి ఈ సినిమాతో రవితేజ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.