మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న డిస్కో రాజా షూటింగ్ స్పీడందుకుంది. మరో నెలలో షూటింగ్ పనులు మొత్తం ముగింపు దశకు చేరుకోనున్నాయి. ఇక సినిమా రిలీజ్ కూడా రెండు నెలల తరువాత ఉంటుందని సమాచారం. అసలైతే డిస్కో రాజా ఆగస్ట్ ఎండింగ్ లోనే రావాల్సింది కానీ షూటింగ్ కి మధ్యలో బ్రేకులు పడటం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. 

మ్యాటర్ లోకి వస్తే సినిమా కథపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. సినిమాలో రవితేజ యంగ్ అండ్ ఓల్డ్ గెటప్పుల్లో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారంలో ఉన్నదే. అయితే హిమాలయ్యాలో చాలా ఏళ్ల క్రితం పడుకున్న వ్యక్తి కోమాలోకి వెళ్లి మళ్ళీ ప్రస్తుతం కాలంలోకి లేచి ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథట. 

ప్రస్తుత రోజుల్లో ఉన్న టెక్నాలిజిని మనుషుల నడవడిక, ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్స్ కు మారడం,  సోషల్ మీడియా వరల్డ్, మెట్రో రైళ్లలో ప్రయాణం వంటి విషయాలు అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయట. 

ఒక్కసారిగా పాత కాలం నుంచి ప్రస్తుత కాలానికి షిఫ్టయితే ఆ మనిషి ఎలా ఉంటాడు అనేది సినిమాలో మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. దర్శకుడు విఐ.ఆనంద్ ఈ సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ - నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.