మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్కు ఇచ్చేలా ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఒక రేంజ్ లో అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. ఇటీవల విడుదలైన 'క్యాచ్ మీ' సాంగ్ లో డింపుల్ హయతి తన గ్లామర్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. 

ప్రతి సాంగ్ కి దేవిశ్రీ అదిరిపోయే బీట్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రమేష్ వర్మ రవితేజ ఫాన్స్ కోసం నెవర్ బిఫోర్ మాస్ ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ లీక్ అయింది. 

ఈ చిత్రంలో రవితేజ, డింపుల్ హయతి మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రవితేజ, డింపుల్ హయతికి లిప్ కిస్ ఇస్తున్న పిక్ లీక్ అయింది. ఈ పిక్ లీక్ అయి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. డింపుల్ హయతి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా.. తెలుగు హీరోయిన్లు రొమాంటిక్ సీన్స్ లో నటించలేరు అనే అపవాదుని తాను తొలగించబోతున్నట్లు పేర్కొంది. 

తన కామెంట్స్ ని డింపుల్ ఈ చిత్రంలో నిలబెట్టుకుంటోంది. గ్లామర్ కు ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా ఒక రేంజ్ లో డింపుల్ హయతి రెచ్చిపోతుండడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక రవితేజ కూడా లిప్ లాక్ సీన్స్ కి వ్యతిరేకం అనే తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశాడు. 

డింపుల్ హయతితో పాటు మీనాక్షి చౌదరితో కూడా ఈ మూవీలో రవితేజ లిప్ లాక్ సీన్ లో నటించినట్లు సమాచారం. దీనితో యూత్ పండగ చేసుకునే మూవీ ఖిలాడీ అని చెప్పొచ్చు. ఖిలాడీ కనుక హిట్ అయితే ముందుగా అడ్వాంటేజ్ డింపుల్ హయతికే అని చెప్పాలి. చూద్దాం మరి ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉందో!