హీరోలు లెక్కలు హీరోలకు ఉన్నట్లే..ఫ్యాన్స్ లెక్కలు..ఫ్యాన్స్ కు ఉంటాయి. తమ హీరో ఏ డైరక్టర్ తో చేస్తున్నాడు...ఏ రీమేక్ సైన్ చేసాడు...ఏ హీరోయిన్ తో జతకట్టబోతున్నాడు వంటి విషయాల్లో వాళ్లు నిరంతరం అప్ డేట్ లో ఉంటారు. అంతేకాదు..ఫలానా రీమేక్ చేస్తున్నాడనగానే ఆ ఒరిజనల్ సినిమాచూసి సజెషన్స్ ఇవ్వటం వంటివి కూడా చేస్తూంటారు. 

అలాగే ఇప్పుడు రవితేజ తన తాజా చిత్రానికి కాజల్ తో కలిసి నటించబోతున్నాడనే విషయం తెలిసి కంగారుపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు వేస్తున్నారు. కాజల్ మంచి నటే కావచ్చు కాని, రవితేజ తో సెంటిమెంట్ గా వర్కవుట్ కాదని తేలుస్తున్నారు.

గతంలో రవితేజ, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన సారొచ్చారు, వీర చిత్రాలు రెండూ డిజాస్టర్ అయ్యాయి. దాంతో మరోసారి వీరిద్దరూ త్వరలో థెరి రీమేక్ లో కలిసి నటించబోతున్నారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో వద్దని అంటున్నారు. 

2016 లో తమిళ స్టార్  హీరో విజయ్ 'తేరి' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. పోలీస్  డ్రామా గా తెరకెక్కిన అదే సినిమాను ఇప్పుడు తెలుగులో మాస్ మహారాజా రవితేజ రీమేక్ చేస్తున్నారు. రభస ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ముందుగా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకున్నారు కానీ పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేయడంతో రవితేజ ను తీసుకున్నారు. 

రవితేజ ఓకే చెప్పినప్పటికీ, కథలో తెలుగు నేటివిటీకి సరిపోయేలా కొన్ని మార్పులు చేయమని సూచించాడట. కానీ స్క్రిప్టు ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమా ను హోల్డ్ లో పెట్టారు. తాజా సమాచారం ప్రకారం రవితేజ ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ చేసిన మార్పులు రవితేజకు నచ్చడంతో సినిమా లో నటించడానికి మాస్ మహారాజా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ మళ్ళి ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఒకవైపు ఈ సినిమాలో షూటింగ్లో నటిస్తూనే మరోవైపు వి.ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయనున్నాడు రవితేజ. ఇక ఈ రెండు సినిమాలు ఇదే ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.