రవితేజ “ఈగల్” మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో రవితేజ ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం “సలార్”. డిసెంబర్ 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీకు ఓపినింగ్స్ ఓ రేంజిలో ఉండబోతున్నాయి. అందుకే సలార్ థియేటర్లలోని రవితేజ “ఈగల్” మూవీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. రవితేజ అసలే వరస ప్లాఫ్ లతో వెనకబడ్డాడు. దాంతో రవితేజ ప్రాజెక్టుపై క్రేజ్ క్రియేట్ చెయ్యటానికి అదిరిపోయే ట్రైలర్ కట్ చేసారట. ఆ ట్రైలర్ ని “సలార్” థియేటర్స్ వేయటడంతో అందరిదృష్టీ పడుతుందని భావిస్తున్నారు. ఆ ట్రైలర్ లోనే సంక్రాంతి రిలీజ్ డేట్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఉంటుంది. ఈ విధంగా ప్రభాస్...క్రేజ్ ని రవితేజ గెట్ బ్యాక్ అవ్వడానికి హెల్ప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న ఈ హీరో మార్కెట్ చాలా దారుణంగా పడిపోవటమే అందుకు కారణం. మరో ప్రక్క ఓటిటిలు సైతం ఉత్సాహంగా సినిమాలు ఎక్కువ రేటుకు తీసుకోవటానికి ముందుకు రావటంలేదు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ వంటి కొంతమంది పెద్ద నిర్మాతలు రవితేజను పక్కన పెట్టేశారు. మరో ప్రక్క నెక్స్ట్ రవితేజ చేయబోయే రెండు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అది కూడా ఈ హీరో తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకుంటేనే ఆ రెండు సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ రవితేజ మాత్రం తన రెమ్యునరేషన్ ని మాత్రం తగ్గించుకునే ఆలోచనలో లేడట. ప్రస్తుతం ఆ రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి పారితోషకం విషయంలో రవితేజతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రవితేజ “ఈగల్” మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో రవితేజ ఉన్నారు.
ఇక “ఈగల్” విషయానికి వస్తే... కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ రూపొందిస్తున్న చిత్రం ఇది ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ రవితేజతో రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని అమాంతం పెంచేశాయి. “ఈగల్” మూవీని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ధమాకాని మించి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
ఈ క్రమంలో డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీని ప్రదర్శించే థియేటర్లలో “ఈగల్” ట్రైలర్ ను వేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు.అలాగే వెనక్కి తగ్గేదేలేదని “ఈగల్” మూవీనీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
