రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషనల్‌ ప్లాన్‌తో బిజీ అయ్యారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే...


 రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం ఈగల్‌ (Eagle). కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషనల్‌ ప్లాన్‌తో బిజీ అయ్యారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాసం ఉందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. థియేటర్స్ సమస్య ఉండటం మూలంగా తప్పుకునే అవకాసం ఉందంటున్నారు. అయితే దర్శక, నిర్మాతలు మాత్రం తాము సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ అవుతూంటే ఎందుకూ బేస్ లెస్ రూమర్స్ అని విసుక్కుంటున్నారు. 

అయితే సంక్రాంతికు వచ్చే సినిమాల్లో ఏదో ఒకటి తప్పుకుంటేనే థియేటర్స్ సమస్య తీరుతుందని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా హనుమాన్ తప్పుకుంటుందని అన్నారు. ఇప్పుడు జనవరి 26 కు ఈగల్ వెళ్తుందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం వెనక ఏదైనా వ్యూహం ఉందా అని రవితేజ అభిమానులు అనుమానిస్తున్నారు. ఈగల్ కు నాన్ థియేటర్స్ రైట్స్ అమ్ముడు కాలేదు కాబట్టి తప్పుకుంటే బెస్ట్ అని నిర్మాతని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈగల్ కనుక సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటే ఆ థియేటర్స్ మొత్తం నా సామిరంగా సినిమాకు వెళ్తాయి. అయితే నిర్మాత ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. 

ఇప్పటికే మాస్ ఊచకోత.. ఇప్పటిదాకా విన్నారు.. మీ ఎడ్రినలిన్ వేగాన్ని పెంచే ట్రైలర్‌ అంటూ లాంఛ్ చేసిన పోస్టర్‌ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ సాగే డైలాగ్స్‌ తో కట్ చేసిన ట్రైలర్‌.. సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో సినిమాపై అంచనాలు పెంచుతోంది. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను..

దర్శకుడు మాట్లాడుతూ...సినిమా కథను ట్రైలర్‌లో చూపించాం. అప్పటినుంచి ఈగల్ సీరియస్ సినిమా అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఈగల్‌లో రవితేజ సార్ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండదు. కానీ మరో మార్గంలో వినోదం ఉంటుంది. ఫైనల్‌గా ఈగల్‌ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌. ఎలాంటి విసుగు తెప్పించే ఎలిమెంట్స్‌ ఉండవు.. జోనర్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను చూస్తారు. రవితేజ మార్క్‌ ఎలిమెంట్స్‌ కొన్నింటిని కూడా సినిమాలో వినియోగించకుండా కథానుగుణంగా తీశాం. రవితేజ సార్‌లోని ప్రోయాక్టివ్‌ ఎలిమెంట్స్‌ను ఇందులో చూస్తారని చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈగల్‌లో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్‌ పోస్టర్లు, స్టైలిష్ లుక్‌, ట్రైలర్‌ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ ట్రైలర్‌లో మాస్‌ మహారాజా రవితేజ స్టైల్‌లో సాగుతున్న మార్క్‌ డైలాగ్స్‌ అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.