మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. రీసెంట్ గా ‘ఖిలాడీ’తో అలరించారు. ఇప్పుడు‘ధమాకా’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ టీం స్పెయిన్ లో ఉంది.

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు రెస్ట్ లెస్ గా మూవీ షూటింగ్స్ తో పాల్గొంటున్నారు. క్రాక్ మూవీ తర్వాత నిర్విరామంగా మాస్ మహారాజా ఫ్యాన్స్ కు ఏదోక అప్డేట్ అందుతూనే ఉంది. రీసెంట్ గా ‘ఖిలాడీ’ (Khiladi) మూవీతో ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను అలరించిన రవితేజ మరో రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ‘రామరావు ఆన్ డ్యూటీ’ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ధమాకా’ మూవీపై ఫోకస్ పెట్టాడు ఈ మాస్ హీరో.. 

ఇప్పటికే, ఈ మూవీ నుంచి అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గత నెలలో మాస్ మాహారాజ యాక్షన్ సీన్స్ షూటింగ్ లో పాల్గొన్నారు. హై యాక్షన్ సీన్స్ కోసం టాలీవుడ్ సూపర్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ లు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు యాక్షన్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ధమాకా టీం ప్రస్తుతం స్పెయిన్ లో తదుపరి షెడ్యూల్ ను కొనసాగిస్తోంది. మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం.. మాస్ మహారాజ ధమాకా మూవీ న్యూ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ మొత్తం స్పెయిన్ లో కొనసాగనుంది. ఇప్పటి వరకు యాక్షన్ పార్ట్ ను కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్.. ఇక సాంగ్స్ పై ఫోకస్ పెట్టాయి. ఇందు కోసం టీం స్పెయిన్ కు వెళ్లింది.

అయితే ప్రేక్షకులకు మంచి విజువల్స్, లోకేషన్స్ ను చూపించేందుకు మేకర్స్ స్పెయిన్ లోని ఓ అద్భుత లోకేషన్ ను ఎంచుకున్నారు. సాంగ్స్ షూటింగ్ లో భాగంగా స్పెయిన్ లోని హిస్టారికల్ ప్లేస్ ‘ప్లాజా డి ఎస్పానా’లో సాంగ్స్ షూట్ చేయనునన్నారు. ఈ ప్రదేశం స్పెయిన్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇలాంటి ప్రాంతంలో షూటింగ్ చేయడం పట్ల మూవీలో వండర్ ఫుల్ లోకేషన్స్ ను ప్రేక్షకులకు చూపించేందుకు క్రుషి చేస్తున్నారు.

Scroll to load tweet…

 త్రీనాథ్ రావ్ నక్కిన డైరెక్షన్ లో రవితేజ (Ravi Teja) నటిస్తున్న సినిమా ధమాక. ఈ సినిమాలో పెళ్ళి సందడి ఫేమ్ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ఇద్దరు తారలు రవితేజ తో కలిసి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ధమాకా సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ ధమాక కు కథ, మాటలు అందిస్తున్నారు.