Asianet News TeluguAsianet News Telugu

రవితేజకి రూ.100 కోట్లు ఇచ్చేశారు.. డిజాస్టర్లు పడుతున్నా తగ్గేదే లే అంటున్న ప్రొడక్షన్ హౌస్ ?

ప్రస్తుతం రవితేజ ఈగల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థగా సినిమాలు నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజతో మైండ్ బ్లోయింగ్ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ravi Teja crazy 100 cr deal with this production house dtr
Author
First Published Dec 4, 2023, 12:46 PM IST

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఒక హిట్టు మూడు ఫ్లాపులు అన్నట్లుగా సాగుతోంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ రవితేజ మాత్రం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు. 

ప్రస్తుతం రవితేజ ఈగల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థగా సినిమాలు నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజతో మైండ్ బ్లోయింగ్ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజకి పీపుల్ మీడియా 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఒక్క సినిమా రెమ్యునరేషన్ కాదులేండి. 

తమ బ్యానర్ లో రవితేజ నాలుగు చిత్రాలు చేసేందుకు పీపుల్ మీడియా నిర్మాతలు రవితేజతో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు. అంటే ఒక్కో చిత్రానికి 25 కోట్ల రెమ్యునరేషన్ రవితేజకి దక్కుతోంది. ఆల్రెడీ పీపుల్ మీడియాలో రవితేజ ధమాకా అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం నటిస్తున్న ఈగల్ మూవీ కూడా ఆ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. 

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక రీమేక్ చిత్రంలో రవితేజ నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఆ చిత్రాన్ని నిర్మించబోయేది కూడా పీపుల్ మీడియానే. ఇక నాల్గవ చిత్రానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయట. రవితేజ తో పక్కా మాస్ చిత్రాలు చేయాలనే పీపుల్ మీడియా భావిస్తోంది. దీనికోసం టాప్ మాస్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా రవితేజ నెక్స్ట్ మూడు చిత్రాలు లాక్ అయినట్లే అని టాక్ వినిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios