Balakrishna: బాలయ్య, రవితేజ ...మల్టిస్టారర్ ఖరారు? డైరక్టర్ ..డిటేల్స్

దీంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. రవితేజకు అనిల్ రావిపూడికి మంచి సంబంధాలే ఉన్నాయి. రాజా ది గ్రేట్ అంటూ రవితేజకు హిట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

Ravi Teja, Balakrishna mutlistarrer movie

 

స్టార్స్ మల్టిస్టారర్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే జనం కూడా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంతే చూడటానికి ఇంట్రస్ట్ చూపెడుతున్నారు.అదిరిపోయే ఓపినింగ్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆర్.ఆర్. ఆర్ మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేసింది.  ఈ క్రమంలో దర్శకులు మల్టిస్టారర్స్ చేయటానికి కథ లు రెడీ చేసుకుంటున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు ఎంతో ఉత్సుకతను చూపిస్తున్నట్టుఅనిపిస్తోంది.

 అన్ స్టాపబుల్ షోలో ఇతర హీరోలతో మాట్లాడిన సమయంలో ఇదే విషయాన్ని చెప్పేశాడు. కథ సెట్ అయితే బన్నీతోనూ ఓ సినిమా చేస్తాను అని అనేశాడు. రవితేజతోనూ సినిమాను చేస్తాను అని చెప్పేశాడు. అయితే ఇప్పుడు అది నిజం కాబోతోందనిపిస్తోంది. అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో బాలయ్యతో ఓ సినిమా  చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.బాలయ్యకు అనిల్ రావిపూడి ఓ కథను కూడా చెప్పేశాడట. ఆ కథ బాలయ్యకు బాగానే నచ్చిందట.

ఆ కథలో రవితేజను కూడా తీసుకుందామని అన్నాడట. దీంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. రవితేజకు అనిల్ రావిపూడికి మంచి సంబంధాలే ఉన్నాయి. రాజా ది గ్రేట్ అంటూ రవితేజకు హిట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలో  బాలయ్య రవితేజలను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చేందుకు అనిల్ రావిపూడి వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందని తెలుస్తోంది.

ఓ ప్రక్కన రవితేజ వరుస పెట్టి ప్రాజెక్ట్‌లను చేస్తున్నాడు. చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. అలాగే ఇప్పటికే చిరంజీవి బాబీ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. మరో వైపు అనిల్ రావిపూడి ఎఫ్ 3ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు.  ఈక్రమంలో అనిల్ రావిపూడి బాలయ్య రవితేజ ప్రాజెక్ట్‌కు ఎప్పుడు స్టార్ట్ అవుతుందీ అంటే టైమ్ పడుతుందనే చెప్పాలి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios