క్షయ వ్యాధి సోకి, కప్పు టీకి కూడా డబ్బులేని స్థితిలో ఆసుపత్రిలో బతుకుపోరాటం చేస్తున్న హీరోయిన్ ప్రియ దడ్వాల్‌ కు 'రేసుగుర్రం' సినిమా ఫేమ్ రవి కిషన్ సాయం చేశారు. ముంబైలోని టీఆర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురించి తెలుసుకున్న రవి కిషన్, తన స్నేహితుడైన ఉదయ్‌ భగత్ ద్వారా చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు అందజేశారు.

ఇందుకు సంబంధించిన వార్తల లింకులు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, 1990ల్లో వచ్చిన ‘వీర్‌ఘటి’ చిత్రంలో ప్రియ సల్మాన్‌ ఖాన్‌ కి జోడీగా నటించారు. 1997లో వచ్చిన ‘తుమ్సే ప్యార్ హో గయా’ సినిమాలో ఆమె పూజ ధడ్వాల్ పేరుతో రవికిషన్‌ కు జోడీగా నటించారు.