Asianet News TeluguAsianet News Telugu

రవిబాబు “అదిగో” టాక్ ఏంటి ఇంత తేడాగా?

సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'బంటీ' పేరుతో ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు కూడ. ఈ సినిమాలో రవిబాబు కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై రవిబాబు చాలా హోప్సే పెట్టుకున్నారు. 

Ravi babu's Adigo US talk
Author
Hyderabad, First Published Nov 7, 2018, 8:39 AM IST

ఆర్టిస్ట్ గానే కాదు దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు రవిబాబు . వైవిధ్య కథలతో   అలరించే రవిబాబు ఈ సారి మరో ప్రయోగాత్మక సినిమా “అదిగో” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పంది పిల్ల ప్రధానంగా సాగే ఈ సినిమాను భారీ విఎఫ్ఎక్స్ తో రూపొందింది. 

సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'బంటీ' పేరుతో ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు కూడ. ఈ సినిమాలో రవిబాబు కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై రవిబాబు చాలా హోప్సే పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజ్ అవుతున్న  ఈ చిత్రానికి సంభందించి ఇప్పటికే యూఎస్ లో షోలు పడ్డాయి.  రిలీజైన “అదిగో” టాక్ ఏంటో చూద్దాం...

అందుతున్న సమాచారం మేరకు....“అదిగో” చిత్రంలో  రెండు లోకల్ క్రిమినల్ గ్యాంగ్ లు ఏనిమల్ రేసింగ్ చేస్తూంటాయి. అందులో భాగంగా బంటి(పందిపిల్ల) ని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో మరో రెండు పెద్ద మాఫియా గ్యాంగ్ లు కూడా అదే పందిపిల్ల కూడా వెతుకుతున్నారని రివీల్ అవుతుంది. వాళ్ల కారణం వారికి ఉంటుంది. ఈ గ్యాంగ్ లల్లో ఎవరికి ఈ పందిపిల్ల దొరుకుతుంది. అసలు ఎందుకు ఆ గ్యాంగ్ లు ఈ పందిపిల్లను వెంటాడుతున్నాయనేది ఈ చిత్రం కథా నేపధ్యం.  

ఇక యుఎస్ నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం  “అదిగో” చిత్రం అప్ టుది మార్క్ లేదు. గంటా యాభై నిముషాల రన్నింగ్ టైమ్ లో ఈ కామెడీ సినిమా నవ్వించింది చాలా తక్కువ సేపు. అసలు ఫస్టాఫ్ లో పంది కనపడేది... పది నుంచి పదిహేను నిముషాలు మాత్రమే.  కామెడీ పేరుతో చేసే కొన్ని చేష్టలు నవ్వించకపోగా వెగటు పుట్టిస్తాయి. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి ఇలాంటి హాఫ్ బేకెడ్ కామెడీ రావటం ఆశ్చర్యమనిపిస్తుంది. అయితే  యానిమేషన్ క్వాలిటీ మాత్రం బాగుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios