బాలీవుడ్ స్వరదిగ్గజం.. లతా మంగేష్కర్(Latha Mangeshkar) దాదాపుగా నెలరోజులుగా కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. 92 ఏళ్ల లతాజీ.. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈ రోజు వెంటిలెటర్ పై ఉంచారు. అయితే ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.
కరోనాకు గురైన బాలీవుడ్ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ జనవరి 8న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్ప్రతి చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారు. అయితే లతాజీ హెల్త్ అప్డేట్స్ ను అటు బంధువులు, ఇటు డాక్టర్లు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఎలాంటి అప్డేట్ వచ్చినా లతాజీ ఆరోగ్యం కొద్దికొద్దిగా కోలుకుంటున్నారనే సమాచారమే అందింది. దీంతో లతా మంగేష్కర్ మరికొద్ది రోజుల్లో కోలుకుంటారని సినీ ప్రముఖులు, బంధువులు, అభిమానులు భావించారు.
కానీ, తాజాగా బ్రీచ్ కాండీ ఆస్ప్రతి వారు అందించిన అప్డేట్ ఒక్కసారిగా అభిమానులు, లతాజీ రిలేటీవ్స్, సినీ ప్రముఖలను షాక్ కు గురి చేస్తోంది. లతాజీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, మెరుగైన వైద్య అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పందిస్తూ ‘లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. మళ్లీ వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఆమె కోలుకోవాలని ప్రార్థనలు చేయండి’ అంటూ పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా దేశమంతా లతాజీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు.
ఈ మేరకు లతాజీ త్వరగా కోలుకోవాలని తమ వంతు ప్రయత్నంగా ఆదేవున్ని ప్రార్థిస్తున్నారు. బాలీవుడ్ నటి ‘రవీనా టాండన్’(Raveena Tandon), యాక్టర్ అఫ్తాబ్ శివదాసాని కూడా లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ఆదేవున్ని ప్రార్థించారు. తమ ట్విట్టర్ ఖాతాలో లతాజీ ఫొటోలు షేరు చేశారు. అఫ్తాబ్ శివదాసాని ప్రత్యేకంగా లతాజీకోసం సాయిబాబా ఫొటోను షేర్ చేసి, ఆయన జీవితాంశాలు కూడా తెలుసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
ఇక ఫ్యాన్స్ లత మంగేష్కర్ హెల్త్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయం భయంగా గడుపుతున్నారు. ఈ మేరకు అభిమానులు ట్విట్టర్ వేదికన సర్వస్వతీ, సాయిబాబా ఫొటోలను షేర్ చేసి ప్రార్థిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
గతంలోనే లతాజీ ఆరోగ్యం క్షీణిస్తోందనే అంశం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న న్యూస్ వ్యాప్తి చెందింది. దీంతో స్పందించిన డాక్టర్లు, బంధువులు అలాంటిదేదీ లేదని వెల్లడించారు. మరోవైపు మహారాష్ర్ట వైద్య శాఖ మంత్రి రాజేష్ టోపే కూడా లతాజీ ఐసీయూలో క్షేమంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఉన్నట్టుండి డాక్టర్లు ఈ రోజు లతాజీ పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ అప్డేట్ ఇవ్వడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. లతాజీ కోలుకోవాలని పెద్ద ఎత్తున ప్రేయర్లు చేస్తున్నారు.
