Asianet News TeluguAsianet News Telugu

Rashmika Mandanna:ఆయన నన్ను హింసించారు... రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ మిస్ అయ్యా.. రష్మిక షాకింగ్ పోస్ట్

రష్మిక నటించిన గత మూడు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అమ్మడు పారితోషికంగా కూడా భారీగా పెంచేశారట. ఇప్పటికే దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నారని వినికిడి.

rashmika wants to take revenge on her gym trainer  this is why
Author
Hyderabad, First Published Jan 17, 2022, 3:03 PM IST

సోషల్ మీడియాలో రష్మిక (Rashmika Mandanna)చాలా యాక్టీవ్ గా ఉంటారు. వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజెన్స్ కి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు. 

తాజాగా తన జిమ్ ట్రైనర్ పై రష్మిక సెటైర్లు వేశారు. అతన్ని ఉద్దేశిస్తూ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. సదరు ట్రైనర్ పై రివేంజ్‌ తీర్చుకునే చాన్స్‌  కోల్పోయానంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. రష్మిక-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇక బన్నీ-రష్మికపై తెరకెక్కించిన 'సామీ సామీ' సాంగ్ పిచ్చ పాప్యులర్ అయ్యింది.  అయితే రష్మిక జిమ్‌ ట్రైనర్‌ కుల్దీప్ సేతీ కూడా సామీ సామీ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ వీడియో చూసి రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది. 

''కుల్దీప్ జిమ్‌లో ట్రైనింగ్ సెషన్‌లో భాగంగా వర్కౌట్స్‌ సరిగ్గా చేయమంటూ నన్ను టార్చర్ చేస్తుంటాడు, వద్దన్నా చేయిస్తూ ఉంటాడు. అయితే ఇలా సామి సామి సాంగ్‌కు స్టెప్పులు వేస్తాడని తెలిస్తే దగ్గరుండి నేనే ఆ స్టెప్పులు నేర్పిస్తూ మళ్ళీ మళ్ళీ చేయమని రివేంజ్ తీసుకునేదాన్ని. మిస్‌ అయ్యాను'' అని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేసింది రష్మిక. దీంతో ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం రష్మిక వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీగా ఉన్నారు. హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలలో నటిస్తున్నారు. పుష్ప హిందీలో భారీ విజయం సాధించిన నేపథ్యంలో మరిన్ని ఆఫర్స్ దక్కే సూచనలు కలవు. తెలుగులో పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ మూవీలో రష్మిక నటిస్తున్నారు. అలాగే శర్వానంద్ కి జంటగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం చేస్తున్నారు. 

రష్మిక నటించిన గత మూడు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అమ్మడు పారితోషికంగా కూడా భారీగా పెంచేశారట. ఇప్పటికే దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నారని వినికిడి. పుష్ప ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. సంక్రాంతి పండుగకు కూడా పుష్ప వసూళ్లు దక్కించుకుంటుంది. బరిలో చెప్పుకోదగ్గ చిత్రాలు లేని కారణంగా... ప్రేక్షకులు పుష్ప థియేటర్స్ కి వెళుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios