కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.

అయితే ముందుగా చిత్రయూనిట్ ఆమెని హీరోయిన్ గా చేయమని అడిగినప్పుడు ఈ భామ నో చెప్పిందట. తమిళంలో శివ కార్తికేయన్ సినిమా ఒప్పుకోవడంతో మహేష్ సినిమాకు డేట్స్ లేవని చెప్పిందట. దీంతో దర్శకనిర్మాతలు మరో ఆప్షన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

అయితే శివకార్తికేయన్ సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదని భావించిన రష్మిక ఆ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుందట. నటిగా తనకు మంచి అవకాశాలు వస్తోన్న సమయంలో కేవలం గ్లామర్ డాల్ గా సినిమాలో కనిపించడం ఆమెకి ఇష్టం లేదట.

ఆ కారణంగానే శివకార్తికేయ సినిమా నుండి తప్పుకొని దర్శకుడు అనీల్ రావిపూడికి సమాచారం ఇవ్వడంతో ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అనీల్ రావిపూడి తన సినిమాల్లో హీరోయిన్స్ కి మంచి క్యారెక్టర్స్ ఇస్తాడు.

కామెడీ, యాక్షన్ కూడా రాస్తుంటాడు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఆకట్టుకునే విధంగా ఉండడంతో మహేష్ సినిమాలో నటించాలని నిర్ణయించుకుందట.