గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను షేక్ చేసిన జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందాన. ఈ జోడి ఆ సినిమా రిలీజ్ కు ముందు సోషల్ మీడియాలో వారి పాత్రలకు సంబందించిన హావభావాలతో మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇకపోతే ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమాతో మళ్ళీ కలిసి నటిస్తున్న ఈ జంట మరోసారి ట్విట్టర్ వేదికగా అందరిని ఆకర్షిస్తోంది. 

ఈ మధ్య గూగుల్ రిలీజ్ చేసిన మోస్ట్ సెర్చిడ్ సెలబ్రెటీల్లో రష్మిక కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఆ విషయం గుర్తు చేస్తూ పార్టీ అడిగాడు. అలాగే డియర్ కామ్రేడ్ ఫోటో పోస్ట్ చేశాడు. ఇక రష్మిక కూడా అదే తరహాలో స్పందిస్తూ.. మరి నా పార్టీ ఎక్కడ డియర్ ఫిల్మ్ ఫెర్ విన్నర్ అండ్ రోడి వేర్. నువ్వు కూడా గూగుల్ మోస్ట్ సెర్చిడ్ (4వ) యాక్టర్ అంటూ ఎలక్షన్స్ రిజల్ట్స్  తరువాత పార్టీ అన్నావ్.. ప్రామిజ్ చేశావ్? ఎక్కడ? అని పేర్కొన్నారు. 

దీంతో మరోసారి ఈ జంట మధ్య సంభాషణ నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఈ  సినిమాతో ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నారని టాక్ వస్తోంది.  ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న డియర్ కామ్రేడ్ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.