టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ కొంచెం కొంచెంగా తన లెవెల్ ని పెంచుకుంటూ వెళుతోంది. గీతా గోవిందం తరువాత అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయింది.  

సమంత - కాజల్ - పూజ వంటి నటీమణులు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉంటే యువ హీరోయిన్స్ ఆ ఛాన్స్ ని అందుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న యంగ్ బ్యూటీల్లో రష్మిక మహేష్ తో నటించే అవకాశాన్ని చటుక్కున అందుకుంది. రెమ్యునరేషన్ కోటి దాటినట్లు సమాచారం.  

సరిలేరు నీకెవ్వరు అనే ఈ సినిమాలో బేబీ మంచి రోల్ లో మెరవనుందట. ఈ ఛాన్స్ తో అమ్మడి రేంజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా హిట్టయితే నెక్స్ట్ టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం పక్కా. ఇప్పటికైతే రశ్మికకు ఎవరు సరిలేరు. పూజా హెగ్డే బాగానే అవకాశాలు అందుకుంటున్నప్పటికీ అమ్మడు ఎన్ని రోజులు టాప్ లో ఉంటుందో చెప్పడం కష్టమే..!