రష్మిక మందాన ఫస్ట్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ విడుదలకు సిద్ధమైంది. అమితాబ్, రష్మిక నటించిన గుడ్ బై రిలీజ్ డేట్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.  

క్వీన్, సూపర్ 30 లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కింది గుడ్ బై మూవీ. కామెడీ డ్రామాగా రూపొందగా అమితాబ్, రష్మిక మందాన ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీ నేడు ప్రకటించారు. రష్మికతో పాటు గాలి పటాలు అమితాబ్ ఎగరవేస్తున్నారు. రష్మిక లుక్ చాలా సింపుల్ గా ఉంది. దేశీ డ్రెస్ లో డీగ్లామర్ రోల్ చేస్తున్నారనిపిస్తుంది. 

ఇక వరల్డ్ వైడ్ 'గుడ్ బై' అక్టోబర్ 7న దసరా కానుకగా విడుదల కానుంది. రష్మిక మందాన నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ చిత్రం గుడ్ బై. అలాగే మొదటిసారి ఫుల్ టైం కామెడీ చిత్రం చేస్తున్నారు. సీనియర్ నటుడు అమితాబ్ తో పాటు రష్మిక వెండితెరపై ఎలా కనిపిస్తారనే ఆసక్తి కొనసాగుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. శోభా కపూర్, ఏక్తా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బాల్ నిర్మిస్తున్నారు. గుడ్ బై డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…

కాగా రష్మిక నటించిన మరో రెండు హిందీ చిత్రాలు మిషన్ మజ్ను, యానిమల్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. మిషన్ మజ్ను చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. ఇక రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ తెరకెక్కుతుంది. వీటితో పాటు పుష్ప 2, వారసుడు వంటి భారీ ప్రాజెక్ట్స్ రష్మిక ఖాతాలో ఉన్నాయి.