నేషనల్ క్రష్ రష్మిక మందన జోరు తగ్గడం లేదు. టాలీవుడ్ లో రష్మిక వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది రష్మిక పుష్ప చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన జోరు తగ్గడం లేదు. టాలీవుడ్ లో రష్మిక వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది రష్మిక పుష్ప చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంతో రష్మిక ప్రేక్షకులని పలకరించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. 

ఇదిలా ఉండగా రష్మిక క్రేజ్ క్రమంగా బాలీవుడ్ కి కూడా పాకుతోంది. తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. తెలుగు దర్శకుడు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఎనిమల్'. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. 

పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందనని ఎంపిక చేసినట్లు దర్శకుడు సందీప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ చిత్రంలో రష్మిక గీతాంజలి పాత్రలో నటించబోతున్నట్లు సందీవ్ తెలిపారు. 

ఆల్రెడీ రష్మిక హిందీలో మిషన్ మజ్ను అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు రణబీర్ కపూర్ సరసన నటించే ఛాన్స్ దక్కడంతో రష్మికకు ఇది గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. తన హాట్ అండ్ క్యూట్ లుక్స్ తో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. అర్జున్ రెడ్డిని మించేలా ఇంటెన్స్ రొమాన్స్, ఎమోషన్స్ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Scroll to load tweet…