విజయ్ దేవరకొండ , రష్మిక మండన్న కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో  రష్మిక పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోంది.  అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక పాత్ర పేరు లిల్లి అని ఆమె తెలంగాణ మహిళా క్రికెటర్ గా ఈ చిత్రంలో కనిపించనుందని సమాచారం. 

అంతేకాకుండా ఈచిత్రంలో రష్మిక తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుందని వినికిడి. ఇక ఈ పాత్ర కోసం మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దగ్గర క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకుంటుంటుదని వినికిడి.

ఇక విజయ్ ఈచిత్రంలో స్టూడెంట్ గా కనిపించనున్నాడు.  విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా ఇప్పటికే గీత గోవిందం సినిమా పెద్ద హిట్‌ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.  నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జైకృష్ణ మాటలు రాస్తున్నారు. రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరామెన్: సుజిత్ సరంగ్, ఎడిటర్: శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్: జైకుమార్, బ్యానర్స్: మైత్రి మూవీమేకర్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి (సి.వి.ఎం), యస్.రంగినేని.