కన్నడ బ్యూటీ రష్మికకి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఈ బ్యూటీకి యంగ్ హీరోల సరసన మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది.

ఇంతలో ఆమెకి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా #విజయ్64 లో హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని ఆమెతో చర్చలు జరుపుతున్నారు.

ఇప్పటికే తమిళంలో కార్తి సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుంది. మొదటి సినిమా రిలీజ్ కూడా కాకుండా అప్పుడే స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా.. అల్లు అర్జున్, సుకుమార్ ప్రాజెక్ట్ లో కూడా ఈమెని తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తన సత్తా చాటుతోంది ఈ బ్యూటీ.