Asianet News TeluguAsianet News Telugu

Rashmika Mandanna:యానిమల్ తర్వాత రష్మిక రేంజ్ పెరిగిందా.. నెక్స్ట్ మూవీకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్

ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తోంది. అయితే యానిమల్ తర్వాత రష్మిక సైన్ చేసిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. 

Rashmika mandanna shocking remuneration after Animal success dtr
Author
First Published Dec 9, 2023, 4:27 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యానిమల్ చిత్రం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక .. రణబీర్ కపూర్ కి జోడిగా నటించింది. రష్మిక ఈ చిత్రంలో ఇంటిమేట్ రొమాన్స్ కూడా పండించింది. సందీప్ రెడ్డి సినిమా అంటే ఏమాత్రం బోల్డ్ సన్నివేశాలు తప్పకుండా ఉంటాయి. 

బాక్సాఫీస్ వద్ద యానిమల్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 500 కోట్ల మార్క్ దాటేసింది. రష్మికకి అవకాశాలు తగ్గుతున్న సమయంలో యానికల్ చిత్రం పెద్ద బూస్ట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తోంది. అయితే యానిమల్ తర్వాత రష్మిక సైన్ చేసిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. 

ఇటీవల ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం రష్మిక అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. ఏకంగా 3 కోట్ల వరకు రష్మిక ఈ చిత్రానికి ఛార్జ్ చేస్తోందట. 

యానిమల్ బ్లాక్ బస్టర్ కావడం వల్లే రష్మిక తన రెమ్యునరేషన్ పెంచి ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఈ చిత్రం ఫిమేల్ ఓరియెంటెడ్ కథ. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ గా రష్మిక 1.5 నుంచి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం కాబట్టి రష్మిక తన భుజాలపై కథని నడిపించాలి. కాబట్టే ఆమె అంత రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

Also Read: ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, రమ్యకృష్ణ వీళ్ళు కనుక విలన్స్ అయితే ఏ హీరో నిలబడలేడు.. విధ్వంసమే కదా..

అయితే రాహుల్ రవీంద్రన్ ముందుగా ఈ కథని సమంత కోసం రాసుకున్నట్లు తెలుస్తోంది. సమంత రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విధంగా సమంతకి రాహుల్ కథ వినిపించాడట. సమంత కూడా ఒకే చెప్పిందట. కానీ సమంత తన ఆరోగ్య కారణాల రీత్యా ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో స్క్రిప్ట్ రష్మిక వద్దకి వెళ్ళింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios