గీతగోవిందం హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న గోవా వెళ్లారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అసలే వాళ్లిద్దరి మధ్యా ఏదో ఉందంటూ రచ్చ రచ్చ చేస్తున్న మీడియాకు కోతికి కొబ్బరికాయ దొరికినట్లైంది. దాంతో గోవాలో వాళ్లిద్దరూ అంటూ యూట్యూబ్ ధంబ్ నెయిల్ హెడ్డింగ్ లు పెట్టి పండగ చేసుకుంటున్నారు. ఇంతలా గోవా విషయం హాట్ టాపిక్ గా మారుతుందని వాళ్లిద్దరికీ తెలియదా. అందూలోనూ వీళ్లిద్దరూ కలిసి నటించటమే కాదు ..డేటింగ్ కూడా చేసుకుంటున్నారని మీడియా కూసింది. దానికి రష్మిక గతంలో కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చింది.

 సినిమాల్లో కాస్తంత కలిసి నటించినంతమాత్రాన ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా..లింకులు పెడితే పెంకులు పగులుతాయనే అర్దం వచ్చేటట్లు వార్నింగ్ ఇచ్చింది. అయినా అవన్నీ ఎవరు పట్టించుకుంటారు.మా గోల మాదే..మీ గొడవ మీదే  అన్నట్లుంటుంది మీడియా.  అయితే  రష్మిక గోవా వెళ్లిన టైంలోనే విజయ్ దేవరకొండ కూడా గోవాకి బయలుదేరి వెళ్ళాడమే పులిహార కలిపెయ్యటానికి కారణమైంది. వీటిని ఈ సారి కాస్త తెలివిగా కొట్టిపారేయాలనుకుంది రష్మిక.

   గోవా నుంచి రష్మిక తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చాట్ చేసింది. అప్పుడు కూడా ఆమె ఫ్యాన్స్ ..డైరక్ట్ గా విజయ్ దేవరకొండ పేరు ఎత్తకుండా మళ్లీ అదే ప్రశ్న అడిగారు. “ఎవరితో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు?” అని. దాంతో  రష్మిక ఒక వీడియో పోస్ట్ చేసింది. తన స్నేహితురాళ్ళతో కలిసి గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో అది. తాను  గోవా వీరితో వచ్చాను, విజయ్ దేవరకొండతో కాదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.