ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించారు.
ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించారు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బేబీ మూవీ రూపంలో ఆ దాహం తీరింది. చిన్న దేవరకొండకి తొలి హిట్ లభించింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. విజయ్ దేవరకొండ తో ఉన్న పరిచయమో ఇంకేమో కానీ.. రష్మిక ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రాన్ని వీక్షించింది. అంతే కాదు ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది.
'బేబీ చిత్రాన్ని చూశాను. మూవీలో అద్భుతమైన ఎమోషనల్ పెర్ఫామెన్స్ చూసి ఏడుపు వచ్చేసింది. ప్రతి సన్నివేశం నా హృదయంలో చాలా కాలం నిలిచిపోతుంది. చిత్ర యూనిట్ కి నా అభినందనలు' అంటూ రష్మిక ట్వీట్ చేసింది.
ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా నిడివి ఎక్కువైందని.. విరాజ్ పాత్రలో క్లారిటీ లేదని ఇలా చిన్న చిన్న లోపాలు వినిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా మంచి చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసలు దక్కుతున్నాయి.
రష్మిక మాత్రమే కాదు ఇతర సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్ పాత్రలో నటించి మెప్పించడమే కాదు ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.
