'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక 'గీత గోవిందం' చిత్రంతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోంది 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది.

అలానే నితిన్ తో మరో సినిమాకు సైన్ చేసింది. ఈ మధ్యకాలంలో ఆమె వరుసగా తెలుగు సినిమాలనే ఎన్నుకుంటున్నారని, కన్నడ చిత్రాలకు సంతకం చేయడం లేదని ఓ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త రష్మిక వరకు వెళ్లడంతో ఆమె సదరు వెబ్ సైట్ ని ప్రశ్నించింది. 

తన సొంత చిత్ర పరిశ్రమ తనపై కోపంగా ఉండడం ఏంటని ప్రశ్నించింది. ఎవరు కోపంగా ఉన్నారో చెప్పాలని అడిగింది. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ''ఇలా అడుగుతున్నానని తప్పుగా అర్ధం చేసుకోకండి.. కానీ నాకు తెలుసుకోవాలనే ఆత్రుత ఉంది.

నాకు నేరుగా మెసేజ్ చేయండి. సాధారణంగా నేను ఇలాంటివి పట్టించుకోను. చిత్రపరిశ్రమ గురించి మీరు ఇలా రాయడం, వారి నాపై కోపంగా ఉన్నారని చెప్పడంలో అర్ధం లేదు. నేను దీన్ని నమ్మను. నాకు ఆధారాలు కావాలి.ఇవ్వండి'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.