దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నెక్స్ట్ అఖిల్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ నిర్మాత బన్నీ వాసు మాత్రం ఈ కాంబినేషన్ పై రోజు చర్చలు జరుపుతున్నాడు. ఇక రీసెంట్ గా కథ పూర్తిగా సెట్ అవ్వడంతో త్వరలో సినిమాను స్టార్ట్ చేయాలనీ ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. 

అయితే అఖిల్ కి దర్శకుడు భాస్కర్ కు ఇప్పుడు తప్పనిసరిగా హిట్టవసరం. ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని సెంటిమెంట్స్ ను కూడా బాగానే ఫాలో అవుతున్నారట. అసలు విషయంలోకి వస్తే.. కథానాయికగా గీత గోవిందం మేడమ్ రష్మిక మందన్నను వీరు సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

వరుస హిట్స్ తో ప్లాప్ లో ఉన్న హీరోలకు లక్ష్మి దేవిలా మారిన అమ్మడు ఇప్పుడు అఖిల్ కి కూడా అదే తరహాలో హెల్ప్ అవుతుందని నిర్మాత ఆమెను ఫైనల్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. సొంత బాషా కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న బేబీ డియర్ కామ్రేడ్ సినిమాతో త్వరలోనే మూడు భాషలవారిని పలకరించనుంది.