Asianet News TeluguAsianet News Telugu

ఫారెస్ట్ లో కోట్ల డబ్బు దాచిపెట్టిన రష్మిక మందన్నా.. ఇంట్రెస్టింగ్‌గా ఆమె `కుబేర` ఫస్ట్ లుక్‌ గ్లింప్స్

నేషనల్‌ క్రష్‌ రష్మిక సడెన్‌గా షాకిచ్చింది. ఆమె రాత్రి సమయంలో ఫారెస్ట్ లో డబ్బు కోసం తవ్వకాలు చేపట్టడం షాకిచ్చింది. మరి ఇంతకి ఏం జరుగుతుంది.
 

rashmika mandanna money hunting in night time her kubera first look glimpse interesting arj
Author
First Published Jul 5, 2024, 3:21 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్‌లోనే టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె చేస్తున్న సినిమా పరంగానూ ఆమె టాప్‌లో ఉంది. మరే స్ఠార్‌ హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా అవకాశాలను అందుకోవడంతోపాటు, క్రేజ్‌ పరంగానూ దుమ్మురేపుతుంది. ఎక్కువగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ ల్లో భాగం అవుతూ రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాలున్నాయి. అందులో ఒకటి `కుబేర`. ధనుష్‌, నాగార్జున హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ చిత్రమిది. 

సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుంది. ఆమె ధనుష్‌కి జోడీగా కనిపించనున్నట్టు  తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుంచి ధనుష్‌ ఫస్ట్ లుక్‌, నాగార్జున ఫస్ట్ లుక్‌ వచ్చాయి. ఇప్పుడు రష్మిక మందన్నా ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు. ఈ మేరకు గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో రష్మిక మందన్నా ఓ దట్టమైన అడవిలోకి వెళ్లింది. గడ్డపార, పారతో వెళ్లి ఓ స్థలాన్ని ఎంపిక చేసుకుని తవ్వించింది. అందులో ఓ పెద్ద సూట్‌ కేస్‌ ఉంది. దాన్ని బయటకు తీసి చూడగా కోట్ల డబ్బు ఉంది. దాన్ని చూసి ఆనందంతో సూట్‌ కేసు తీసుకుని ఒంటరిగా బయలు దేరింది రష్మిక. రాత్రి సమయంలోనే ఇదంతా జరగడం విశేషం. 

చూడ్డానికి కాస్త రిచ్‌ అమ్మాయిలా ఉన్న రష్మిక మందన్నాకి అంతటి డబ్బు ఎక్కడిది, ఎందుకు ఫారెస్ట్ లో దాచింది? ఆ డబ్బు తనదేనా? దీని వెనుక ఏదైనా ఉందా? అనేది తెలియాలంటే మాత్రం `కుబేర` సినిమా చూడాల్సిందే. ఈ సినిమా నుంచి విడుదల చేసిన రష్మిక మందన్నా ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఆలోచింప చేస్తుంది. ఈ సినిమా డబ్బు, పేద, ధనిక అనే వ్యత్యాసాలను ప్రతిబింబించేలా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ధనుష్‌ బికారీగా కనిపిస్తే, నాగార్జున రిచ్‌గా కనిపించారు. ఆయన ఓ ప్రభుత్వ అధికారి పాత్ర అని తెలుస్తుంది. రష్మిక పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె డిఫరెంట్ అవతార్‌లో  కనిపించి ప్రేక్షకులలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  

ఈ సినిమాలో మైథలాజికల్‌ ఎలిమెంట్లు కూడా ఉన్నాయట. శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామాలో డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడేసింది. శేఖర్ కమ్ముల `కుబేర ` నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ కాస్ట్ తో  రూపొందుతున్నమోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. జిమ్ సర్భ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ అంచనాలను పెంచేలా ఉంది. ఓ కొత్త తరహా ఉండబోతుందని టీమ్‌ చెబుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుందని చెప్పింది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios