టైటిల్‌ ప్రకారం ఈ సినిమా మహిళా ప్రధానంగా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో రష్మిక పాత్ర సైతం అంతే ప్రయారిటీ కలిగి ఉంటుందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైంది. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. `రెడ్‌` తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు రష్మిక ముంబయి నుంచి వచ్చింది. అయితే టైటిల్‌ ప్రకారం ఈ సినిమా మహిళా ప్రధానంగా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో రష్మిక పాత్ర సైతం అంతే ప్రయారిటీ కలిగి ఉంటుందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

తాజాగా ఈ చిత్రంలోని రష్మిక లుక్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఆమె రెడీ అవుతున్న దృశ్యాన్ని షూట్‌ చేయగా, అది మానిటర్‌లో కనిపిస్తుంది. దాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇప్పుడీ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మిక ట్రెడిషనల్‌గా, మరింత అందంగా కనిపిస్తుంది. చూడబోతే `గీతగోవిందం` తర్వాత మరోసారి అలాంటి పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తుందని తెలుస్తుంది. 

Scroll to load tweet…

ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్‌ సరసన `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తుంగా, సుకుమార్‌ రూపొందిస్తున్నారు. దీన్ని ఆగస్ట్ 13న విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యమైంది. మరో రిలీజ్‌ డేట్‌ని ఇంకా వెల్లడించలేదు. మరోవైపు రష్మిక హిందీలోకి ఎంట్రీ ఇస్తూ సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్‌ మజ్ను`, అమితాబ్‌తో కలిసి `గుడ్‌ బై` చిత్రాలతోపాటు మరో సినిమా చేయనుంది.