కన్నడ నటి రష్మిక మందన్నా టాలీవుడ్ లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది. స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ భామ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.  

దీంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది రష్మిక. ఇది ఇలా ఉండగా.. 'గీత గోవిందం' సినిమా తరువాత రష్మిక రెమ్యునరేషన్ పెంచేసిందని ప్రచారం జరిగింది. ఇదే విషయంపై తాజాగా మీడియా సమావేశంలో రష్మికని ప్రశ్నించగా దానికి ఆమె రెమ్యునరేషన్ పెంచడం సాధారణమైన విషయమని.. కొన్నేళ్ల నుండి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నానని.. నటిగా తన ఎదుగుదలలో పారితోషికం కూడా ఓ భాగమే అంటూ చెప్పుకొచ్చింది.

రష్మిక తన మొదటి సినిమాకు రూ.40 లక్షల పారితోషికం తీసుకుంది. ఆ తరువాత ప్రాజెక్ట్ నుండి రూ.60 లక్షల నుండి రూ.80 లక్షల వరకు తీసుకుంటుంది. తన కొత్త కన్నడ సినిమా 'పొగరు'కి రూ.64 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోంది.