టాలీవుడ్‌, బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న రష్మిక మందన్నా తాజాగా మరో తమిళ సినిమాకి సైన్‌ చేసిందట. అంతేకాదు హీరో విక్రమ్‌ సరసన నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే పాన్‌ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన కథానాయిక. ఇటీవల కాలంలో రష్మిక లాంటి కెరీర్‌ గ్రాఫ్‌ మరే హీరోయిన్ కి కూడా లేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో దూసుకుపోయింది. హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఇండియాలో పెద్ద ఇండస్ట్రీలైనా టాలీవుడ్‌, బాలీవుడ్‌లో దుమ్మురేపుతుందీ క్యూట్‌ బ్యూటీ. 

తాజాగా మరో తమిళ సినిమాకి సైన్‌ చేసిందట. అంతేకాదు హీరో విక్రమ్‌ సరసన నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. నిజానికి ప్రస్తుతం విక్రమ్‌ నటిస్తున్న `తంగలాన్‌` మూవీలో హీరోయిన్‌గా రష్మిక నటించాల్సి ఉంది. ఆమె ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యింది. కానీ చివరి నిమిషంలో తప్పుకుంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో సినిమాల కమిట్‌ మెంట్ల కారణంగా, డేట్స్ సెట్‌ కాకపోవడంతో తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆయనతోనే సినిమా చేయాల్సి వస్తుంది.

ఇటీవల మలయాళంలో `2018`తో సంచలనం సృష్టించారు దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్‌. ఈ సినిమా సుమారు 150కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. దీంతో అందరి దృష్టిని ఆకర్షించారు జోసెఫ్‌. తాజాగా ఆయనతో సినిమా చేసే కమిట్‌ మెంట్‌ తీసుకుంది లైకా ప్రొడక్షన్‌. తాజాగా విక్రమ్‌ హీరోగా సినిమా చేయబోతుందట. 

ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం రష్మికని అనుకుంటున్నారట. అయితే మొదట రష్మికతోపాటు మాళవిక మోహనన్‌ పేరు కూడా వినిపించింది. ప్రస్తుతం విక్రమ్‌తో ఆమె `తంగలాన్‌` మూవీలో నటిస్తున్న నేపథ్యంలో మరోసారి రిపీట్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకి వచ్చారట. కానీ అనూహ్యంగా రష్మిక పాజిటివ్‌గా ఉండటంతో ఆమెని పక్కని పెట్టి ఈ నేషనల్‌ క్రష్‌ కి ఓకే చెప్పారని సమాచారం. ఇదే నిజమైతే అప్పుడు విక్రమ్‌ కి నో చెప్పిన శ్రీవల్లి ఇప్పుడు ఓకే చెప్పాల్సి రావడం విశేషం. 

ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా తెలుగులో బన్నీతో `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే శరవేగంగా ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. ఇందులో మరోసారి శ్రీవల్లిగా రచ్చ చేసేందుకు రాబోతుంది రష్మిక. ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. దీంతోపాటు హిందీలో రణ్‌ బీర్‌ కపూర్ తో `యానిమల్‌` సినిమా చేస్తుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇది డిసెంబర్‌లో రాబోతుంది. మరోవైపు తెలుగులో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `రెయిన్‌బో`లో నటిస్తుంది రష్మిక. మొత్తానికి ఫుల్‌ జోస్‌లో ఉందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళంలో `సుల్తాన్‌`, `వారసుడు` చిత్రాలు చేసింది రష్మిక.