రష్మిక   మరో బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన షారూఖ్‌తో జోడీ కట్టింది. ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. అంతేకాదు సైలెంట్‌గా షూటింగ్ లో పాల్గొనడం విశేషం. 

రష్మిక మందన్నా వేగంగా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. కన్నడలో కెరీర్‌ ప్రారంభించి ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ చిత్రాలతో దూసుకుపోతుంది. వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో అలరిస్తుంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌తో, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌తో జోడీ కట్టింది రష్మిక. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన షారూఖ్‌తో జోడీ కట్టింది. ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. అంతేకాదు సైలెంట్‌గా షూటింగ్ లో పాల్గొనడం విశేషం. 

అయితే రష్మిక.. షారూఖ్‌తో సినిమా చేయడం లేదు. ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్టూడియోలో ఓ యాడ్‌ ని షూట్‌ చేస్తుంది. ఇందులో ఈ ఇద్దరు మొదటి కలిసి నటిస్తుండటం విశేషం. ప్రభూజీ ప్యూర్‌ ఫుడ్‌ అనే బ్రాండ్‌ కోసం రష్మిక, షారూఖ్‌ జోడీ కట్టారు. మొదటి సారి ఈ ఇద్దరు కలిసి యాడ్‌ చేయడం విశేషం. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో రష్మిక లుక్‌ కొత్తగా ఆశ్చర్యపరిచేలా ఉంది. సీజీ ఎఫెక్ట్ లేక, ఆమె అలా మారిపోయిందా ? ఏమోగానీ రష్మిక సహజమైన లుక్‌ని కోల్పోయినట్టుగా ఉంది. 

ఇక షారూఖ్‌ ఈ ఏడాది ప్రారంభంలో `పఠాన్‌`తో సంచలనాలు సృష్టించారు. ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఇది జపాన్‌లో విడుదల కాబోతుంది. ఇక ఇప్పుడు `జవాన్‌` చిత్రంతో రాబోతున్నారు షారూఖ్‌. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో భారీ స్థాయిలో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో నయనతార, దీపికా పదుకొనె హీరోయిన్లుగా నటించారు. ఇందులో షారూఖ్‌ హీరోగా, విలన్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప2`తో బిజీగా ఉంది. అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు హిందీలో `యానిమల్‌` చిత్రం చేస్తుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరో. ఈ సినిమా డిసెంబర్‌ లో రాబోతుంది. అలాగే `బట్టర్‌ ఫ్లై` అనే ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం చేస్తుంది. దీంతోపాటు ఇటీవల ధనుష్‌-శేఖర్‌ కమ్ముల చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇది సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది.