`పుష్ప` క్రేజీ అప్‌డేట్‌.. రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కి టైమ్‌ ఫిక్స్

`పుష్ప`(pushpa) నుంచి ఫస్ట్ లుక్‌, అల్లు అర్జున్‌(allu arjun) లుక్‌, టీజర్‌, ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. వీటికి అద్భుతమైన స్పందన లభించింది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌(pushpa update)ని ఇవ్వబోతున్నారు యూనిట్‌.

rashmika mandanna first look from pushpa release time fix

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్(allu arjun)‌, రష్మిక మందన్నా(rashmika mandanna) జంటగా నటిస్తున్న చిత్రం `పుష్ప`(pushpa). క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాని డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌, అల్లు అర్జున్‌ లుక్‌, టీజర్‌, ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. వీటికి అద్భుతమైన స్పందన లభించింది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ని ఇవ్వబోతున్నారు యూనిట్‌. `పుష్ప`లో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. రేపు(బుధవారం) ఉదయం 9.45గంటలకు రష్మిక మందన్నా అమేజింగ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని సాంగ్‌ షూటింగ్‌కి సంబంధించిన ఓ బ్యూటీఫుల్‌ని లొకేషన్‌ని పంచుకుంది యూనిట్‌. ఈ పిక్స్ వైరల్‌ అయ్యాయి. 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో `పుష్ప` చిత్రం సాగుతుందని, ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. విలన్‌గా పాత్రలో మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌  పతాకంపై నవీన్‌ ఎర్రేని, వై.రవి శంకర్‌ నిర్మిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios