Asianet News TeluguAsianet News Telugu

రష్మిక ఫేక్‌ వీడియో,మండిపడ్డ అమితాబ్

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సినీ ప్రముఖులు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వీడియోపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Rashmika Mandanna deepfake video goes viral, Amitabh Bachchan reacts jsp
Author
First Published Nov 6, 2023, 12:45 PM IST


ఎన్ని జాగ్రతలు తీసుకున్నా సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలు, వీడియోలు వస్తూనే ఉన్నాయి. వానిటి వైరల్ చేస్తూ వారి  పర్శనల్ లైఫ్ కు ఇబ్బందులు కలిగేలా కొందరు చేస్తున్నారు. తాజాగా నటి రష్మిక మందన్న ఫేక్ వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.   ప్రస్తుతం రష్మిక మందన్న డీప్ నెక్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో లిఫ్ట్ లోపల నిలబడి ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారందరూ రష్మికనే అని పొరపడుతున్నారు.  బహిరంగా ప్రదేశాల్లో రష్మిక ఇలాంటి డ్రెస్‌ వేయడం ఏంటి..? మరీ ఇంత హాట్‌గా ఎందుకు కనిపించారు..? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.. ఆ వీడియోను చూసి చాలా మంది షాకింగ్ అంటూ కామెంట్స్ చేసారు.

 అయితే ఈ వీడియోలో రష్మిక కాదని అర్దమైంది. కావాలని కొందరు  ఓ డీప్ ఫేక్ వీడియోను రూపొందించి హల్ చల్ చేశారు.అలాగే ఆమె ఫారిన్ స్లాంగ్ మాట్లాడడం చూస్తే అది పక్కా ఫేక్ వీడియో అని..ఏఐతో మార్పింగ్ చేశారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సినీ ప్రముఖులు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వీడియోపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

 
ఇక ఈ వీడియో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ ని కూడా చేరింది. ఆయన  కూడా ఈ వీడియోపై స్పందించారు. ఇలాంటి వీడియోల మీద మండిపడ్డారు. వీడియో క్రియేట్‌ చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని తన ట్విటర్‌ ఎక్స్‌ ద్వారా రియాక్ట్‌ అయ్యారు. ఆ వీడియో నిజమని కొందరు నమ్ముతున్న సమయంలో వాస్తవికతను జర్నలిస్ట్ అభిషేక్ మొదట ఆ వీడియో షేర్‌ చేస్తూ.. వాస్తవాన్ని వెల్లడించారు. చెప్పాలంటే, ఈ వీడియోలో జారా పటేల్ అనే యువతి ఉన్నారని ఆయన తేల్చేశారు. అయితే కొందరు సోషల్‌ మీడియా ముసుగులో రష్మిక ముఖాన్ని ఆమె ముఖంలోకి మార్ఫింగ్ చేసి ఆ వీడియో వైరల్ చేశారు. ఇంతకుముందు కూడా రష్మిక మందన్న ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారు.

 

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే ఆమె  నటించిన 'యానిమల్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. రణబీర్ కపూర్ సరసన రష్మిక నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లిప్‌లాక్ సన్నివేశాలు వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి డైరెక్ట్‌ చేశారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయంతో బాలీవుడ్‌లో మరిన్ని ఛాన్స్‌లు దక్కించుకోవాలనే ప్లాన్‌లో ఈ బ్యూటీ ఉంది. తను నటించిన పుష్ప-2 వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక దుమ్ము రేపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios