వేణు స్వామి వివాదంలో..రష్మిక మందన్న.. ఫేక్ ఫూజలంటూ.. వైరల్ అవుతున్న వీడియోలు..
ప్రస్తుతం టాలీవుడ్ లో వేణు స్వామి వివాదం ఏ రేంజ్ లో నడుస్తుందో తెలిసిందే..? ఈ వివాదంలో వేణుస్వామితో పూజలు చేయించుకున్న తారలు కూడా ఇరకాటంలో పడుతున్నారు. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక పేరు ఈ వివాదంలె తెరపైకి వచ్చింది.
సినీ, రాజకీయ జ్యోతీష్యుడిగా.. స్టార్ డమ్ తో వెలితిపోతున్నాడు వేణు స్వామి. ఇక అనవసర విషలయాల్లో.. జ్యోక్యం చేసుకుని.. అవసరం లేకపోయినా.. సెలబ్రిటీల జీవితాల గురించి.. రకరకాలుగా జ్యోతిష్యం పేరుతో ప్రచారం చేస్తుండటంతో.. వేణు స్వామి వివాదాస్పదుడిగా మాత్రమే కాదు.. ఇబ్బందుల్లో కూడా పడ్డారు.ఇప్పటి వరకు ఎంతో మంది సినిమా వాళ్ల జీవితాల గురించి జాతకం పేరుతో నోటికి వచ్చింది చెపుతూ వచ్చిన వేణు స్వామి.. చుట్టు ఇప్పుడు అనేక కాంట్రవర్సీలు చుట్టుకున్నాయి. ఏ సోషల్ మీడియాను వాడుకుని.. ఇదంతా వేణు స్వామి చేశాడో.. అదే సోషల్ మీడియాలో ఆయన ధారుణంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. అదే సోషల్ మీడియాలో వేణు స్వామి జాతకం బయట పెట్టింది మీడియా.
ఇప్పటికే సెలబ్రిటీల గురించి జాతకం పేరుతో ఏవేవో చెప్పడంతో.. వారి అభిమానులు ఆయనపై కోపంగా ఉన్నారు. ఈక్రమంలో గతంలో నాగచైతన్య సమంత గురించి చెప్పినట్టే.. తాజాగా నాగచైతన్య, శోభితా ధూళిపాల గురించి కూడా వివాదాస్పందంగా మాట్లాడాడు వేణు స్వామి. వారి నిశ్చితార్థం తర్వాత ఈయన చేసిన జాతక ప్రకటన సంచలనం రేపింది. అంతే కాదు ఈ వివాదంలోకి రష్మిక మందన్నను కూడా లాగడంతో వేణు స్వామి మ్యాటర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ఇంతకీ విషయం ఏంటంటే..?
సమంత, నాగచైతన్య విడిపోతారు అని చెప్పడం.. అది నిజం అవ్వడంతో వేణు స్వామి టాలీవుడ్ లో ధారుణంగా పాపులర్ అయ్యారు. గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు కొన్ని నిజం అవ్వడం.. మరికొన్ని మాత్రం అడ్రస్ లేకుండా పోవడంతో.. వేణు స్వామి వివాదాస్పద సినిమా పండితుడిగా పాపులర్ అయ్యాడు. ఇటు రాజకీయంగా కూడా ఆయన జాతకం దారుణంగా ఫెయిల్ అయ్యింది. మరీ ముఖ్యంగా జగన్ పక్కాగా గెలుస్తాడు అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పి.. అబాసుపాలు అయ్యాడు వేణు స్వామి.
ఇక వేణు స్వామిపై అనవసర నమ్మకం పెంచుకున్న సినిమా తారలు ఆయన తో ప్రత్యేక పూజలు చేయించడం స్టార్ట్ చేశారు. అందులో హీరోయిన్లు నిథి అగర్వాల్, రష్మిక మందన్నా.. య్యూట్యూబర్ అష్యురెడ్డి కూడా ఇందులో ఉన్నారు. రష్మికను తన ప్రియుడితో పెళ్ళి చేసుకోద్దు అని చెప్పింది తానే అని.. ఇద్దరి జాగకం బాగాలేదు.. రక్షిత్ శెట్టిని వదిలేసి కెరీర్ పై దృష్టి పెడితే.. స్టార్ అవుతావని వేణు స్వామి ఓ చెప్పినట్టు.. ఆమె అదే పాటించి.. వేణు స్వామితో రాజశ్యామల యాగం చేయించిందట. దాంతో ఆమె నేషనల్ క్రష్ అయ్యింది నావల్లే అని వేణు స్వామి కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు.
ఇక తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాల జాతకం చెబుతూ.. వారిద్దరూ త్వరలోనే విడిపోతారు. వారిద్దరి డైవోర్స్‌కు కారణం మరో మహిళ కారణం అవుతుంది అంటూ వేణు స్వామి చెప్పడం.. టాలీవుడ్ బగ్గుమంది.. ఈ విషయంలో మీడియా నుంచి.. నెటిజన్ల నుంచి ఆయనకు వ్యతిరేకత రావడమే కాదు.. వేణు స్వామి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలి అంటూ.. ఆయనపై కంప్లైయిట్స్ స్టార్ట్ అయ్యాయి. మీడియా మిత్రులు.. సంఘాలు ఆయనపై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈక్రమంలో వేణు స్వామికి నోటీసులు జారీ చేయడం.. ఆ విషయ రచ్చ రచ్చగా మారింది.
ఇక మీడియా.. ముఖ్యంగా ఓ చానల్ లో వ్యక్తి తనను 5 కోట్లు అడిగాడని.. మీడియాను టార్గెట్ చేస్తూ.. వేణు స్వామి..అతనిభార్య ఆత్యహత్య చేసుకుంటాం అంటూ బెదిరింపులు కూడా స్టార్ట్ చేశారు. ఈ విషయంలో మీడియా నుంచి ఇది నిజం అని నిరూపించాలంటూ సవాలు కూడా చేశారు. ఇక్కడే రష్మిక విషయం వివాదం అయ్యింది. గతంలో రష్మికతో చేయించిన పూజలు అన్నీ ఫేక్ అని.. వేణు స్వామికి అసలు పూజలు చేయించడం..మంత్రాలు చదవడం కూడా సరిగ్గా రాదు అని.. ఆయన పూజా విధానంలో ఉన్న తప్పులను మీడియా బయట పెట్టి కడిగిపారేశారు.
వేణు స్వామికి వేద మంత్రాలు వల్లించడం రాదు అంటూ రష్మిక మందన్నకు పూజలు చేస్తున్న వీడియోను బయటపెట్టారు. రష్మిక మందన్నకు రాజ శ్యామల యాగం చేసిన తర్వాత ఆమెకు ఆశీర్వాదం ఇస్తూ.. సంప్రోక్షణ జలం చల్లాలి కాని. నెత్తిమీద పోయడం ఏంటి అంటూ.. తప్పు పట్టారు. అంతే కాదు ఆయన గురించి చాలా విషయాలు బయటపెట్టారు. ఈ రకంగా రష్మిక మందన్నా వేణు స్వామి వివాదంలో సెంటర్ పాయింట్ గా మారారు. ఈ విషయం ఆమెను ఇబ్బందిపెట్టడం ఖాయం అంటున్నారు సినిమా జనాలు.
ఇక సోషల్ మీడియాలో కూడా వేణుస్వామి గురించి రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. ఆయన హీరోయిన్ల తో పూజల పేరిట తప్పుడు పనులు చేస్తున్నారని.. యోని పూజలంటూ.. శృంగార పూజలంటూ..చాలా మంది మహిళలను ఇబ్బంది పెట్టారని.. రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. వేణు స్వామి వివాదం మాత్రం రకరకాల మలుపులు తిరుగతోంది. చివరకు ఏమౌతుందో చూడాలి.