`యానిమల్‌` సినిమాతో నార్త్ లో దుమ్ములేపుతున్న రష్మిక మందన్నా.. తాజాగా కొత్త సినిమా కోసం హైదరాబాద్‌ వస్తుంది రష్మిక. ఒక్క పోస్ట్ తో ఆమె అభిమానులను ఖుషి చేస్తుంది.  

రష్మిక మందన్నా, రణ్‌ బీర్‌ కపూర్‌ జంటగా నటించిన `యానిమల్‌` మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మూడు రోజుల్లో తొలి వీకెండ్లో మూడు వందలయాభై కోట్లు వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా రన్‌ అవుతుంది. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం, రణ్‌ బీర్‌ కపూర్‌ నట విశ్వరూపం, రష్మిక మందన్నా అందాలు, బోల్డ్ నెస్‌, యాక్షన్‌ సీన్లు సినిమాని ఆడియెన్స్ కనెక్ట్ అవుతుంది. పిచ్చిగా నచ్చుతుంది. 

ఈ సినిమాతో రష్మిక మందన్నా ఇమేజ్‌ మరింతగా పెరిగింది. గ్లామర్‌ పరంగానే కాదు, నటనతోనూ ఆడుకుంటుందని ఈ సినిమాతో నిరూపించింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇక `యానిమల్‌` సినిమాకి, ప్రమోషన్స్ కి గుడ్‌ బై చెప్పింది రష్మిక. సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కి వస్తున్నట్టు చెప్పింది. `ది గర్ల్ ఫ్రెండ్‌` షూటింగ్‌లో పాల్గొనబోతుంది. 

ఇటీవలే ఈ సినిమా ఓపెనింగ్‌ జరిగింది. రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ కాబోతుంది. రేపటి నుంచి(డిసెంబర్‌ 5) నుంచి హైదరాబాద్‌లోని షాద్‌ నగర్‌లో చిత్రీకరణ జరపబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం ముంబయి నుంచి వచ్చేసింది రష్మిక. రేపట్నుంచి ఈ సినిమా చిత్రీకరణ పాల్గొనబోతుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఇక `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. దీంతోపాటు రష్మిక `రెయిన్‌ బో` అనే మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. ఇప్పుడు ఆమె జాబితాలో మరో సినిమా చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ యానిమల్‌ సినిమాని వదిలేసి గర్ల్ ఫ్రెండ్ కోసం వస్తున్న రష్మిక మందన్నా అని అంటున్నారు.