కన్నడ బ్యూటీ రష్మిక తెలుగులో 'ఛలో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకొంది. 'గీత గోవిందం' చిత్రంలో తన క్యూట్ లుక్స్ తో యూత్ లో ఫాల్యింగ్ మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్, కార్తి వంటి హీరోలతో కలిసి నటిస్తోంది.

త్వరలోనే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. రష్మికని లాంచ్ చేయాలని చూస్తున్నాడు. ఇది రష్మికకి  మంచి ఆఫర్ అనే చెప్పాలి. రణ్‌దీప్‌ హుడా హీరోగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ సంస్థలో ఓ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాను కొత్త దర్శకుడు బల్వీందర్ సింగ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇంకా రష్మిక ఈ  ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కానీ ఆమె నో చెప్పే ఛాన్స్ లేదని అంటున్నారు.

తెలుగులో రెండు సినిమాలు చేసిందో లేదో.. అప్పుడే బాలీవుడ్ ఆఫర్ పట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు  రావడానికి సిద్ధమవుతోంది.